న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Syed Mushtaq Ali Trophy 2019: శ్రేయాస్ అయ్యర్ రికార్డు సెంచరీ

Syed Mushtaq Ali Trophy 2019: Shreyas Iyer registers highest T20 score by an Indian

హైదరాబాద్: దేశవాళీ టోర్నీ 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ'లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. సిక్కింతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్ కేవలం 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సుల సాయంతో ఏకంగా 147 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

షూటింగ్ వరల్డ్‌కప్: పాక్ షూటర్లకు వీసాలు నిరాకరణ, ఆ ఈవెంట్లను తీసేయండిషూటింగ్ వరల్డ్‌కప్: పాక్ షూటర్లకు వీసాలు నిరాకరణ, ఆ ఈవెంట్లను తీసేయండి

పంత్ చేసిన 128 పరుగులే అత్యధికం

పంత్ చేసిన 128 పరుగులే అత్యధికం

ఇప్పటి వరకూ రిషబ్ పంత్ గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చేసిన 128 పరుగులే భారత్ తరఫున అత్యధికం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే (11), పృథ్వీ షా (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. దీంతో 2.3 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.

బౌండరీల ద్వారా 118 పరుగులు

బౌండరీల ద్వారా 118 పరుగులు

ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌(63)తో కలిసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. సిక్కిం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ సాధించిన 147 పరుగుల్లో 118 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చిన కావడం విశేషం. అయ్యర్ సెంచరీతో చెలరేగడంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.

104 పరుగులు చేసిన సిక్కిం

104 పరుగులు చేసిన సిక్కిం

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం జట్టులో బిపుల్ శర్మ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో సిక్కిం జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో 154 పరుగుల భారీ తేడాతో ముంబై విజయం సాధించింది.

టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

1. శ్రేయాస్ అయ్యర్- 147 (Mumbai vs Sikkim, Syed Mushtaq Ali Trophy 2019)

2. రిషబ్ పంత్- 128* (Delhi Daredevils vs Sunrisers Hyderabad, IPL 2018)

3. మురళీ విజయ్- 127 (Chennai Super Kings vs Rajasthan Royals, IPL 2010)

4. సురేశ్ రైనా- 126* (Uttar Pradesh vs Bengal, Syed Mushtaq Ali Trophy 2018)

5. వీరేంద్ర సెహ్వాగ్- 122 (Kings XI Punjab vs Chennai Super Kings, IPL 2014)

Story first published: Thursday, February 21, 2019, 18:35 [IST]
Other articles published on Feb 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X