న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav says Its completely fine over Hardik Pandyas Lucknow pitch was a shocker

అహ్మదాబాద్: మనలో ఆడే దమ్ముండాలి గానీ పిచ్ ఎలా ఉంటే ఏందని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. పిచ్ ఎలా ఉన్నా.. సవాల్‌ను స్వీకరించి పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని తెలిపాడు. న్యూజిలాండ్‌తో లక్నో వేదికగా జరిగిన రెండో టీ20 పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసింది.

పూర్తిగా స్పిన్‌కు సహకరించిన ఈ వికెట్‌పై ఇరు జట్లు 100 పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదో షాకింగ్ పిచ్ అని తెలిపాడు. ఈ విమర్శల నేపథ్యంలో లక్నో క్యూరేటర్‌పై వేటు పడింది.

పిచ్‌ది ఏముందన్నా..?

పిచ్‌ది ఏముందన్నా..?

ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న చివరి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్‌ను పిచ్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎర్ర భుమా? నల్ల భూమా? అనేది ముఖ్యం కాదు. ఎలాంటి పిచ్‌పై ఆడుతున్నామనేది మన చేతుల్లో ఉండదు. గత మ్యాచ్‌లా పరిస్థితులను అందిపుచ్చుకోవడమే ఆటగాళ్ల చేతిలో ఉంటుంది.

లక్నో మ్యాచ్‌ లో-స్కోరింగ్ గేమ్ అయినా అసలు సిసలు మజా లభించింది. టీ20, వన్డే మ్యాచ్ ఏదైనా ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పుడే అసలు మజా లభిస్తుంది. వికెట్ ఎలా ఉందనేది పెద్ద విషయమే కాదు. సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగడమే ముఖ్యం.'అని సూర్య తెలిపాడు.

మ్యాచ్ తర్వాత చర్చించాం..

ఇక జర్నలిస్ట్‌లు లక్నో పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యాఖ్యలను సూర్య ముందు ప్రస్తావించగా.. గట్టిగా నవ్వుతూ ఆ పిచ్‌నే బాగానే ఉందని బదులిచ్చాడు. మ్యాచ్ అనంతరం దాని గురించి హార్దిక్‌తో మాట్లాడనని, భవిష్యత్తులో ఇలాంటి పిచ్‌లు ఎదురైతే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశాడు. అహ్మదాబాద్ మైదానంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఇక్కడే తన అంతర్జాతీయ కెరీర్ మొదలైందని సూర్య గుర్తు చేసుకున్నాడు.

నా గేమ్ ఇక్కడే మొదలైంది..

నా గేమ్ ఇక్కడే మొదలైంది..

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే వేదికగా ఇంగ్లండ్‌తో సూర్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇదే విషయంపై సూర్య మాట్లాడాడు. 'ఇక్కడి డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే.. మా టీమ్ మేనేజర్‌తో 'నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికే వచ్చాను'అని చెప్పా. ఇక్కడ నాకు మధురానుభూతులు ఉన్నాయి. ఇదో అద్భుతమైన స్టేడియం. అత్యధిక సంఖ్యలో హాజరయ్యే ప్రేక్షకుల మధ్య ఆడటం గొప్పగా ఉంటుంది. రేపటి మ్యాచ్ అసలు సిసలు మజాను అందిస్తోంది'అని సూర్య చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, January 31, 2023, 20:34 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X