న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వచ్చే సీజన్ ఆరో ట్రోఫీ పక్కా.. హామీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav has promised to present the Mumbai team with six trophy next year

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి మరిచిపోలేని అనుభవాన్ని పొందింది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ ఈసారి తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. లీగ్‌లో తొలి ఎనిమిది మ్యాచ్‌లను ఓడిపోయి భారీ అప్రదిష్ట మూటగట్టుకుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం 6 మ్యాచుల్లో నాలుగు గెలిచి మళ్లీ పుంజుకుంది.

ఇక తాజాగా ముంబై ఇండియన్స్ తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'మేము ఎలాగైనా ఐపీఎల్ ఆరో ట్రోఫీని కైవసం చేసుకోవాలి. ఈ సంవత్సరం అది జరగకపోవడం దురదృష్టకరం. వచ్చే ఏడాది తప్పుకుండా మరో ట్రోఫీని సాధించి మొత్తం ఆరు ట్రోఫీలతో మీ ముందుంటాం.' అని సూర్య పేర్కొన్నాడు. సూర్యకుమార్ ఈ సీజన్లో బ్యాటింగ్లో రాణించాడు. వేలి గాయం కారణంగా ప్రారంభంలో ఒక రెండు మ్యాచ్‌లు మిస్సయ్యాడు. అలాగే తన ముంజేయికి గాయం కావడంతో సీజన్లో చివరి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Suryakumar Yadav has promised to present the Mumbai team with six trophy next year

ఇక గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స, శిక్షణ పొందుతున్నాడు, అందువల్ల అతను దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌ కు దూరమయ్యాడు. ఇక ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరచూ తమ ప్లేయింగ్ 11 మార్చడం, ఫీల్డింగ్ వైఫల్యాలు, గాయాలు, స్టార్ ఆటగాళ్ల పేలవమైన ఫామ్ తదితర కారణాలు ముంబైని దెబ్బతీశాయి. కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లు తమపై పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా టోర్నమెంట్‌ తొలి భాగంలో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ చేరగలిగింది. కానీ ఆర్సీబీ క్వాలిఫయర్ 2లో ఓడి ఇంటిబాట పట్టింది.

Story first published: Sunday, May 29, 2022, 17:28 [IST]
Other articles published on May 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X