సురేశ్ రైనా డైరెక్ట్ త్రో: మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన ఊతప్ప రనౌట్

Posted By:
Suresh Raina stunning throw sends robin uthappa to pavilion

హైదరాబాద్: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్నాడు. తొలి ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది ఊపు మీదున్న ఓపెనర్ సునీల్ నరైన్‌ను చక్కటి క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చిన సురేశ్ రైనా... ఆ తర్వాత కళ్ల చెదిరేలా డైరెక్ట్ త్రో విసిరి ఉతప్పను పెవిలియన్ చేర్చాడు.

దీంతో ఒకానొక దశలో 8 ఓవర్లలో 80/2తో భారీ స్కోరు దిశగా సాగుతున్న కోల్‌కతా వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షేన్ వాట్సన్ బౌలింగ్‌లో తొలి బంతికి నితీష్ రాణా ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత బంతికి రైనా అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 29)ను రనౌట్ చేశాడు.

క్రీజ్ వదిలి ముందుకొచ్చిన రాబిన్ ఊతప్ప

క్రీజ్ వదిలి ముందుకొచ్చిన రాబిన్ ఊతప్ప

షేన్ వాట్సన్ విసిరిన బంతిని కవర్స్ దిశగా బాదిన ఊతప్ప క్రీజ్ వదిలి ముందుకొచ్చాడు. ఈ క్రమంలో అద్భుతంగా డైవ్ చేసి ఎడమ చేత్తో బంతిని ఆపిన రైనా వెంటనే పైకి లేచి బౌలర్ వైపు నేరుగా వికెట్లకేసి బంతిని విసిరాడు. దీంతో ఊతప్ప నిరాశగా పెవిలియన్ చేరాడు. దూకుడు మీదన్న రాబిన్ ఊతప్ప ఔట్ కావడంతో చెన్నై అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

చివర్లో ఆండ్రూ రసెల్ మెరుపు ఇన్నింగ్స్

చివర్లో ఆండ్రూ రసెల్ మెరుపు ఇన్నింగ్స్

కాగా, చివర్లో ఆండ్రూ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 26 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించి చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలర్లకు చుక‍్కలు చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్‌.. వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు.

ప్రేక్షకపాత్రకే పరిమితమైన చెన్నై బౌలర్లు

ప్రేక్షకపాత్రకే పరిమితమైన చెన్నై బౌలర్లు

రసెల్‌ బ్యాటింగ్‌ దాటికి చెన్నై బౌలర్లు, ఫీల్డర్లు చేసేదేమీలేక ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. మొత్తం 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో 88 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సూపర్‌ కింగ్స్‌కు మొదట్లో బౌలర్లు శుభారంభం ఇచ్చారు. అయితే కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ ఓవర్‌కు పది పరుగులు చొప్పున రాబట్టారు.

సురేశ్‌ రైనా మెరుపు ఫీల్డింగ్‌తో ఊతప్ప రనౌట్‌

సురేశ్‌ రైనా మెరుపు ఫీల్డింగ్‌తో ఊతప్ప రనౌట్‌

ఆరు ఓవర్లలోపే ఓపెనర్లు సునీల్ నరైన్‌ (12), క్రిస్‌ లిన్‌ (22) పెవిలియన్‌‌కు చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ రాబిన్‌ ఉతప్ప (29) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సురేశ్‌ రైనా మెరుపు ఫీల్డింగ్‌తో ఊతప్ప రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అనంతరం కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (26), రస్సెల్‌తో మరో వికెట్‌ పడకుండా నెమ్మదిగా స్కోరుబోర్డును పరిగెత్తించారు.

చివరి నాలుగు ఓవర్లలో 64 పరుగులు

చివరి నాలుగు ఓవర్లలో 64 పరుగులు

16వ ఓవర్‌ నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన రసెల్‌‌ భారీ సిక్సర్లతో అలరించాడు. చివరి నాలుగు ఓవర్లలో 64 పరుగులు రాబట్టాడు. మిగతా ఆటగాళ్లలో క్రిస్‌ లిన్‌(22), రాబిన్‌ ఉతప్ప(29), దినేశ్‌ కార్తీక్‌(26)లు ఫర్వాలేదనిపించడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 22:28 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి