రైనా 300: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన సురేశ్ రైనాకు ఏప్రిల్ 27న రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ప్రతి సీజన్‌లోనూ 300 పైచిలుకు పరుగులు చేసిన ఒకే ఒక్క క్రికెటర్‌గా గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి రికార్డు రైనా పేరునే ఉంది. ఈ సీజన్‌లో రైనా పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు.

34 పరుగులతో నాటౌట్‌గా

34 పరుగులతో నాటౌట్‌గా

ముఖ్యంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పదో సీజన్‌లో 309 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కి సురేశ్ రైనా ముద్దుల కుమార్తె గ్రేసియా వచ్చింది.

ఎంతో సంతోషించిన సురేశ్ రైనా

తన కుమార్తె ముందు ఆడిన మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవడంతో రైనా ఎంతో సంతోషపడ్డాడు. ‘అభినందలు పప్పా, గుజరాత్‌ లయన్స్‌. మీరు నా తొలి మ్యాచ్‌కు విలువ చేకూర్చారు' అని రైనా సతీమణి ప్రియాంక.. గ్రేసియా తరఫున ట్వీట్‌ చేసింది.

399 పరుగులే అత్యల్ప స్కోరు

399 పరుగులే అత్యల్ప స్కోరు

గత సీజన్‌కు ముందు వరకు రైనా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అంతేకాదు పదేళ్ల ఐపీఎల్‌లో గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ జట్టు తరుపున రైనా చేసిన 399 పరుగులే అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లాడిన ఘన చరిత్ర సురేశ్ రైనాదే.

500కు పైగా పరుగులు మూడు సార్లు

500కు పైగా పరుగులు మూడు సార్లు

అంతేకాదు ఒక సీజన్‌లో 500కు పైగా పరుగులు మూడు సార్లు(2010, 2013, 2014) చేశాడు. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ విజేతగా నిలవడంలో సురేశ్ రైనా కీలకపాత్ర పోషించాడు. సీజన్‌ల వారీగా సురేశ్ రైనా సాధించిన పరుగులు:
* 2017 - 8 మ్యాచ్‌లు - 309 పరుగులు (ఇంకా మ్యాచ్‌లున్నాయి)
* 2016 - 15 మ్యాచ్‌లు - 399
* 2015 - 17 మ్యాచ్‌లు - 374
* 2014 - 16 మ్యాచ్‌లు - 523
* 2013 - 18 మ్యాచ్‌లు - 548
* 2012 - 19 మ్యాచ్‌లు - 441
* 2011 - 16 మ్యాచ్‌లు - 438
* 2010 - 16 మ్యాచ్‌లు - 520
* 2009 - 14 మ్యాచ్‌లు - 434
* 2008 - 16 మ్యాచ్‌లు - 421

Story first published: Friday, April 28, 2017, 17:05 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి