న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కే త‌ర‌పున ఎక్కువ మ్యాచ్‌లాడింది ఎవ‌రో తెలుసా?.. ధోనీ మాత్రం కాదు!!

Suresh Raina played most matches for Chennai Super Kings in IPL, Not MS Dhoni

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే వెంటనే గుర్తొచ్చేది చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు. ఎందుకంటే.. ఐపీఎల్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సీఎస్‌కే జట్టుకు సారథ్యం వహిస్తూ.. ప్ర‌తీసారి టీమ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. సీఎస్‌కే ఆడిన ప‌ది సీజ‌న్ల‌లోనూ కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. అంతేకాదు సీఎస్‌కేకు మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. అయితే సీఎస్‌కే త‌ర‌పున ఎక్కువ మ్యాచ్‌లాడింది మాత్రం ధోనీ కాదు.

<strong>నాకు ఓపెనింగ్‌ కొత్త కాదు.. రోహిత్ వ్యాఖ్యలపై స్పందించిన ధావన్!!</strong>నాకు ఓపెనింగ్‌ కొత్త కాదు.. రోహిత్ వ్యాఖ్యలపై స్పందించిన ధావన్!!

సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు

సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు

టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మ‌న్ సురేష్ రైనా సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లాడి.. అత్య‌ధిక మ్యాచ్‌లాడిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో సీఎస్‌కే మొత్తంగా 165 మ్యాచ్‌లు ఆడగా.. రైనా 164 మ్యాచ్‌లు ఆడాడు. కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్‌ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కార‌ణంగా బరిలోకి దిగలేదు. ఇక సీఎస్‌కే తరఫున ధోనీ 160 మ్యాచ్‌లు ఆడాడు. అంటే ధోనీ ఐదు మ్యాచ్‌లు ఆడలేదు. ధోనీ మైదానంలోకి దిగినప్పుడు రైనా సీఎస్‌కే తరఫున సారథిగా ఉంటాడు.

 ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు:

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు:

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా సురేష్ రైనా పేరిటే ఉంది. రైనా 193 మ్యాచ్‌లు ఆడాడు. 164 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా.. మిగిలిన మ్యాచ్‌లు కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. సీఎస్‌కే రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో ఆ జట్టుకు రైనా సారథ్యం కూడా చేసాడు. సీఎస్‌కే, ఆర్‌ఆర్ స్థానాల్లో కొచ్చి టస్కర్స్, పూణే వారియర్స్ వచ్చాయి.

రెండో స్థానంలో ధోనీ:

రెండో స్థానంలో ధోనీ:

రైనా తర్వాత ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది ఎంఎస్ ధోనీ. 190 మ్యాచ్‌ల‌తో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శ‌ర్మ (188), దినేశ్ కార్తీక్ (182), విరాట్ కోహ్లీ (177) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్‌.. ఇప్ప‌టివ‌ర‌కు 12 ఎడిష‌న్లను పూర్తిచేసుకుంది. ఇప్పటికే 13వ సీజన్ కూడా పూర్తయ్యేది కానీ కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది.

రైనా ఆశలకు కరోనా గండి:

రైనా ఆశలకు కరోనా గండి:

మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్‌నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.

గతేడాది జూలైలో చివరి వన్డే:

గతేడాది జూలైలో చివరి వన్డే:

భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సురేశ్ రైనా.. 78 మ్యాచ్‌లాడి 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.

Story first published: Thursday, May 14, 2020, 15:21 [IST]
Other articles published on May 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X