న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suresh Raina: రైనా టాపార్డర్‌లో ఆడి ఉంటే మరిన్ని పరుగులు చేసేవాడు: ద్రవిడ్

Suresh Raina could have scored more runs had he batted higher up the order says Rahul Dravid

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్‌కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. రిటైర్మెంట్ ప్రకటించి మూడురోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ విషయం గురించే చర్చంతా నడుస్తున్నది. భారత్‌కు అపూర్వ విజయాలను అందించిన ఇద్దరిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అందరూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలకపాత్ర:

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలకపాత్ర:

సురేష్ రైనా సేవలను రాహుల్ ద్రవిడ్‌ మంగళవారం ఓ వీడియోలో గుర్తు చేశారు. టీమిండియాకు ఆడిన ప్రతీసారి రైనా తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని అభిప్రాయపడ్డారు. జట్టు కోసం లోయర్‌ ఆర్డర్‌లోనూ అతడు బ్యాటింగ్‌ చేశాడని, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడని ప్రశంసించారు. 'టీమిండియా అత్యుత్తమ ప్రతిభావంతులలో రైనా ఒకడు. అండర్ 19 క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా బాగా రాణించాడు. భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రైనా కీలకపాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు' అని ది వాల్ అన్నారు.

టాపార్డర్‌లో ఆడి ఉంటే:

టాపార్డర్‌లో ఆడి ఉంటే:

'గత దశాబ్దంన్నర కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. ఆ విజయాల్లో అతడూ భాగస్వామే. భారత జట్టు కోసం రైనా చాలా కష్టమైన పనులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో ఆడాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మొదటి భారత బ్యాట్స్ మాన్ కూడా అతడే. ఎంతో కష్టమైన స్థానాల్లో నిలబడి ఫీల్డింగ్‌ చేశాడు. అవసరమైనప్పుడు బౌలింగ్‌లోనూ రాణించాడు. రైనా టాపార్డర్‌లో ఆడి ఉంటే మరిన్ని పరుగులు చేసి ఉండేవాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చి రైనా ఎంతో విజయవంతమయ్యాడు. అతడో అద్భుతమైన ఐపీఎల్ ఆటగాడు' అని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నారు. సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్‌లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.

13 వికెట్లు కూడా

13 వికెట్లు కూడా"

దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన సురేష్ రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు:

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు:

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు సురేష్ రైనా పేరిటే ఉంది. రైనా మొత్తం 193 మ్యాచ్‌లు ఆడాడు. 164 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా.. మిగిలిన మ్యాచ్‌లు కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. రైనా తర్వాత ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది ఎంఎస్ ధోనీ. 190 మ్యాచ్‌ల‌తో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శ‌ర్మ (188), దినేశ్ కార్తీక్ (182), విరాట్ కోహ్లీ (177) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కెప్టెన్సీ కోసం ధోనీ పేరును నేనే సూచించా: భారత క్రికెట్ దిగ్గజం

Story first published: Wednesday, August 19, 2020, 14:03 [IST]
Other articles published on Aug 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X