కెప్టెన్సీ కోసం ధోనీ పేరును నేనే సూచించా: భారత క్రికెట్ దిగ్గజం

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్సీ కోసం ధోనీ పేరును తానే సూచించినట్లు సచిన్ చెప్పుకొచ్చాడు. అంతకు ముందు మ్యాచ్‌ల్లో ఫస్ట్‌స్లిప్‌లో నిల్చొని ధోనీ ఆటను చదివే నైపుణ్యాన్ని చూశాకే.. తదుపరి కెప్టెన్ అతడేనని బోర్డుకు సలహా ఇచ్చానని వెల్లడించాడు. తాజాగా పీటీఐతో జరిగిన ఇంటర్య్వూలో సచిన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ధోనీ పేరు సూచించా:
'2007లో దక్షిణాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఆ టీ20 ప్రపంచకప్‌కు నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే గాయాల ఉండడం వల్ల టోర్నీకి దూరంగా ఉండాలని భావించా. నాతో పాటు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అందరూ భావించారు. అప్పటికి ద్రవిడ్ కెప్టెన్. అయితే టీ20 జట్టుకు ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ అడిగినప్పుడు.. నేను ఎంఎస్ ధోనీ పేరు సూచించా' అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు.

దగ్గర్నుంచి పరిశీలించా:
'అంతకు ముందు చాలా మ్యాచ్‌ల్లో ఫస్ట్‌స్లిప్‌లో నిల్చొని ఎంఎస్ ధోనీ ఆటను, మైదానంలో అతను వ్యవహరించే తీరును దగ్గర్నుంచి పరిశీలించా. దాంతో పాటు స్లిప్స్‌లో నిలుచున్నప్పుడు ఫీల్డింగ్‌తో పాటు పలు అంశాలపై ధోనీతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలోనే ధోనీకి మ్యాచ్‌ను పూర్తిగా చదివేస్తాడని.. భవిష్యత్తు కెప్టెన్ అతనేనని అప్పుడే ఊహించా. అందుకే బోర్డుకు ధోనీ పేరును సూచించా. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలిసిందే' అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు:
గత శనివారం (ఆగస్టు 15) సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎంఎస్ ధోనీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 16 ఏళ్ళ పాటు భారత జట్టుకు ధోనీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు.

చెన్నైకి కూడా మూడు ఐపీఎల్ టైటిల్స్:
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో మహీ కనిపించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహీ కెప్టెన్. చెన్నైకి కూడా మూడు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. ప్రస్తుతం ధోనీ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నెల 22న చెన్నై బయలుదేరి వెళ్లనున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదాడు.
ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ 11 చైనా సంస్థ?.. కంపెనీ వ్యవస్థాపకులు, బ్రాండ్‌అంబాసిడర్ ఎవరో తెలుసా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications