న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఒకే రాష్ట్రం.. ఒకే ఓటు' తీర్పును మార్చేసిన సుప్రీం కోర్టు

Supreme Court Modifies One State, One Vote Policy, Approves Draft Cricket Board Draft Constitution

హైదరాబాద్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్‌ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. గతంలో తాను ఇచ్చిన తీర్పును మారుస్తూ.. ఒక రాష్ట్రం.. ఒక ఓటు నిబంధనను కొట్టేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం క్యాష్ రిచ్ అపెక్స్ క్రికెట్ బాడీను కొద్ది పాటి సవరణలతో ఆమోదం తెలియజేసింది. అంతేకాకుండా తమిళనాడు సొసైటీలను బీసీసీఐకు చెందిన రికార్డులను నాలుగు వారాల్లోగా అందజేయాలని సూచించింది.

ఆ బెంచ్‌లో జస్టిస్ ఏఎమ్ ఖాన్‌విల్కర్‌తో పాటుగా జస్టిస్ డీవై చంద్రచుద్ సభ్యులుగా ఉన్నారు. ముంబై, సౌరాష్ట్ర, వడోదర, విదర్భ క్రికెట్ అసోసియేషన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించింది. ఇక కొన్ని తప్పనిసరి మార్పులతో బీసీసీఐ ముసాయిదా రాజ్యాంగాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆమోదించింది.

రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీస్‌కు గతంలో ఉన్న శాశ్వత సభ్యత్వాన్ని కోర్టు పునరుద్ధరించింది. ఇక 30 రోజుల్లోపే బీసీసీఐ రాజ్యాంగాన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లన్నీ అమలు చేయాలని స్పష్టంచేసింది. ఒకవేళ అలా చేయలేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక బీసీసీఐలో వరుసగా రెండుసార్లు పదవులు చేపట్టే ముందు కచ్చితంగా మధ్యలో కొంత సమయం బోర్డుకు దూరంగా ఉండాలన్న నిబంధనను అమలు చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.

జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీకి తర్వాతి దశగా వచ్చిన లోధా కమిటీ జనవరి 2015లో ఆరంభమైంది. దాంతో ముద్గల్ కమిటీ బీసీసీఐ స్టేట్ ఆఫ్ అఫైర్స్ చూసుకునేందుకు అంకితమైపోయింది. ఇందులో భాగంగానే 2013లో ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ పలు వివాదాలపై విచారణ జరిపింది. లోధా కమిటీ సిఫారసుల మేరకు క్రికెట్‌కు సంబంధించిన సూచనలు వినేందుకు బీసీసీఐ సిద్ధంగానే ఉంటుంది.

Story first published: Thursday, August 9, 2018, 13:47 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X