న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీశాంత్‌కు ఊరట: బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీం కోర్టు

Supreme Court Judgement On Sreesanth Match-Fixing Controversy | Oneindia Telugu
Supreme Court lifts life ban on S Sreesanth, asks BCCI to reconsider quantum of punishment

హైదరాబాద్: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం శ్రీశాంత్‌ వాదనలు విన్న జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా ధర్మాసనం అభివర్ణించింది.

<strong>ఉగ్రదాడి నేపథ్యంలో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మూడో టెస్టు రద్దు: స్వదేశానికి బంగ్లా క్రికెటర్లు </strong>ఉగ్రదాడి నేపథ్యంలో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మూడో టెస్టు రద్దు: స్వదేశానికి బంగ్లా క్రికెటర్లు

మూడు నెలల్లో సమాధానం చెప్పండి

మూడు నెలల్లో సమాధానం చెప్పండి

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని బీసీసీఐని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. శ్రీశాంత్‌ తరఫున ప్రముఖ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షిద్‌ శుక్రవారం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. "కచ్చితమైన ఆధారాలు లేకుండా బీసీసీఐ.. శ్రీశాంత్‌పై నిషేధం విధించడం దారుణం" అని అన్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం

"2013 ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రీశాంత్‌ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని.. ఒక ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేందుకు ఫిక్సర్లతో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఓవర్‌లో శ్రీశాంత్‌ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అసలు శ్రీశాంత్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడలేదు" అని ఖుర్షిద్‌ అన్నారు.

సరైన ఆధారాలు కూడా లేవు

సరైన ఆధారాలు కూడా లేవు

"అంతేకాదు ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు కూడా లేవు. కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించడం సరికాదు" అని ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీసీసీఐ శ్రీశాంత్‌ను జీవితకాలం నిషేధించడం ఎంతమాత్రం సరికాదని అన్నారు.

కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది

కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది

2018 ఆగస్టులో కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చిందని అయినా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టుకు ఆయన విన్నవించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ధర్మాసనానికి ఖుర్షీద్‌ తెలిపారు. అంతేకాదు, బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తే శ్రీశాంత్‌ తిరిగి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా కూడా ఉన్నాడని ఆయన సుప్రీం కోర్టుకు తెలిపారు.

టోర్నీకి రెండేళ్లు దూరమైన రాజస్థాన్, చెన్నై

టోర్నీకి రెండేళ్లు దూరమైన రాజస్థాన్, చెన్నై

మే 2013లో శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ ఛండిల్లాలపై స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోణపలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురినీ బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. భారత్ తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు.

Story first published: Friday, March 15, 2019, 13:04 [IST]
Other articles published on Mar 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X