న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ ఒంటి చేత్తో క్యాచ్: పెవిలియన్‌కు పాండ్యా (వీడియో)

Superman Samson: Sanju Samson Stuns Hardik Pandya With One-Handed Catch

హైదరాబాద్: ఐపీఎల్ అంటే బ్యాట్స్‌మెన్ షాట్‌లే కాదు. పిచ్‌లో ఫీల్డర్ల ఫీట్ లు కూడా దర్శనమిస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు ఇవే మ్యాచ్‌కు హైలెట్‌గా నిలుస్తాయి కూడా. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడిన ముంబై జట్టు మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆపసోపాలు పడుతూ అతి కష్టంపై పరుగులు చేస్తోంది.

మ్యాచ్ చివర్లో ఉన్న సమయంలో క్రీజులో ఉన్న హార్థిక్ పాండ్యా, బెన్ కట్టింగ్ అడపదడపా బాదుతూనే ఉన్నారు. సరిగ్గా 19.5 బంతికి బౌండరీకి యత్నించిన పాండ్యా షాట్ కొట్టాడు. దగ్గరలో ఫీల్డింగ్ చేస్తోన్న సంజూ శాంసన్ డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో పాండ్యా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.

మ్యాచ్ ఆఖర్లో పరుగులు కాపాడుకోవడం కంటే వికెట్లు తీస్తే వచ్చే ఆనందం రెట్టింపుగా ఉంటుంది. దీంతో రాజస్థాన్ జట్టు కాసేపు సంబరాలు చేసుకుంది. ఇన్నింగ్స్ ముగిసేసరికి 168పరుగులు చేసి రాజస్థాన్ ముందు సాధారణ లక్ష్యాన్ని ఉంచింది.

చేధనలో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు జోస్‌ బట్లర్‌ చెలరేగి పరుగులు చేయడంతో అలవోకగా విజయాన్ని అందుకుంది. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌రేటు నమోదుచేయడంతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న రాజస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇంతకుముందు కోల్‌కతాపై ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. కానీ, ఈ సారి పోటీకి ఇరు జట్లు సమానమైన పాయింట్లు 12తోనే బరిలోకి దిగనున్నాయి.

Story first published: Monday, May 14, 2018, 18:56 [IST]
Other articles published on May 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X