న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల టీ20 ఛాలెంజ్‌: వెలాసిటీపై సూపర్‌నోవాస్‌ విజయం

SUP vs VEL, Womens IPL T20 Challenge 2019: Velocity qualify for final despite loss, Supernovas also progress

ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా వెలాసిటీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌నోవాస్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మెరుగైన రన్‌రేట్‌తో సూపర్‌నోవాస్, వెలాసిటీ జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఇక స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్‌బ్లేజర్స్‌ లీగ్‌ దశ నుండే నిష్క్రమించింది. ట్రయల్‌ బ్లేజర్‌ తొలి మ్యాచ్‌లో గెలిచినా.. రెండో మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడంతో రన్‌రేట్‌ భారీగా పడిపోయింది. ఫైనల్లో వెలాసిటీ, సూపర్‌నోవాస్‌ జట్లు తలపడనున్నాయి.

ఆదుకున్న వ్యాట్‌:

ఆదుకున్న వ్యాట్‌:

144 పరుగుల ఛేదనలో వెలాసిటీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (2), హేలీ మాథ్యూస్‌ (11) త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో డేనియెల్‌ వ్యాట్‌ (43; 33 బంతుల్లో 4×4, 2×6).. కెప్టెన్ మిథాలీ రాజ్‌ (40*; 42 బంతుల్లో 3×4)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. ఈ క్రమంలోనే ఇద్దరు జట్టును విజయం వైపు తీసుకెళ్లారు.

చివరి ఓవర్‌.. 23 పరుగులు:

చివరి ఓవర్‌.. 23 పరుగులు:

అయితే కీలక సమయంలో వ్యాట్‌ను పూనమ్‌ యాదవ్‌ పెవిలియన్ చేర్చింది. అనంతరం మిథాలీ, వేద కృష్ణమూర్తి (30; 29 బంతుల్లో 3×4) వేగంగా ఆడలేకపోయారు. వెలాసిటీ చివరి ఓవర్‌లో 23 పరుగులు చేయాల్సి ఉండగా.. 10 పరుగులే చేసి ఓడిపోయింది. ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచులో 2 పరుగులు చేయాల్సి ఉండగా.. 7 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.

రోడ్రిగ్స్‌ మెరుపులు:

రోడ్రిగ్స్‌ మెరుపులు:

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవాస్‌కు మంచి ఆరంభమే దక్కింది. ప్రియా పూనియా, జయంగని బౌండరీల మోత మోగించారు. పూనియా (16; 2 ఫోర్లు)ను శిఖాపాండే పెవిలియన్‌ చేర్చింది. అనంతరం క్రిజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ (77*; 48 బంతుల్లో 10×4, 1×6) .. జయంగనితో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించింది. జయంగని (38 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఔటయ్యాక.. సోఫీ డివైన్‌తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు డివైన్‌(9), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (1 )ధాటిగా ఆడలేకపోయారు. దీంతో సూపర్‌నోవాస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

Story first published: Friday, May 10, 2019, 9:44 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X