న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వర్షంతో సన్‌రైజర్స్‌ ప్రాక్టీస్ రద్దు: జెర్సీ ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్

By Nageshwara Rao
Sunrisers Hyderabad team practice session starts in Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌కు మరికొద్ది రోజులే ఉండటంతో ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరిపోయారు. ఇక, ప్రాంఛైజీలు సైతం ప్రాక్టీస్ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. తాజాగా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆదివారం తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించింది. అయితే, అనుకోకుండా వచ్చిన వర్షం కారణంగా ఆటగాళ్ల ప్రాక్టీస్ రద్దు అయింది.

వర్షం కారణంగా సన్‌రైజర్స్ ప్రాక్టీస్ రద్దు

ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. వర్షం కారణంగా ప్రాక్టీస్ రద్దు కావడంతో ఆటగాళ్లు ఇండోర్ స్టేడియంలో కసరత్తులు చేశారు. వార్మత్ అనంతరం ఆటగాళ్లంతా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌ తదితర విభాగాల్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సన్ రైజర్స్ జెర్సీని ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్

అంతకముందు ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ధరించే జెర్సీని మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ ఆవిష్కరించారు. సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్వహించిన ఈ జెర్సీ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. జెర్సీ ఆవిష్కరణ అనంతరం పలువురు అభిమానులకు జెర్సీలను అందించాడు. సాయిధరమ్ తేజ్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. గతంలో జరిగిన అనేక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు తన మద్దతుని తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్‌రైజర్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ఏప్రిల్ 9న రాజస్థాన్‌తో తొలి మ్యాచ్

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఏప్రిల్ 9న జరగనున్న ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. సన్‌రైజర్స్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్

ఈ నేపథ్యంలో అతడి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఇక, వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్ అలెక్స్‌ హేల్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంపిక చేసుకుంది. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యం తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అలెక్స్ హేల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయాడు. అయితే టీ20ల్లో హేల్స్‌కు మంచి రికార్డు ఉండటం, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఇతడే ది బెస్ట్ కావడంతో సన్‌రైజర్స్‌ హేల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. 52 అంతర్జాతీయ టీ20ల్లో 31.65 యావరేజితో 1456 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్‌లో అండర్స్‌న్‌ గాయంతో దూరం అవ్వడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Monday, April 2, 2018, 12:56 [IST]
Other articles published on Apr 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X