న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing 11: డేవిడ్ వార్నర్ ఔట్.. జేసన్ రాయ్ ఇన్! పంజాబ్ కింగ్స్‌తో బరిలోకి దిగే సన్‌రైజర్స్ జట్టు ఇదే!!

Sunrisers Hyderabad SRH Playing 11 vs PBKS: David Warner Out And Jason Roy In For Match 36
IPL 2021,SRH VS PBKS: Warner Out, Jason Roy In ప్లే ఆఫ్‌కు చేరుకోవడం అసాధ్యమే!! || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తలపడనుంది. షార్జా వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పంజాబ్​.. పరువు నిలబెట్టుకోవాలని సన్​రైజర్స్​ పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. రెండో దశ తమ తొలి మ్యాచ్​లో విజయం వరకు వచ్చి పంజాబ్ ఓడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్‌ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు బరిలోకి దిగే కేన్ సేనపై ఓ లుక్కేద్దాం.

MS Dhoni: ఆ ప్రణాళికతోనే విరాట్ కోహ్లీని ఔట్ చేశాం.. ఈజీగా బుట్టలో పడ్డాడు: ధోనీMS Dhoni: ఆ ప్రణాళికతోనే విరాట్ కోహ్లీని ఔట్ చేశాం.. ఈజీగా బుట్టలో పడ్డాడు: ధోనీ

ఆ ఒక్క విజయం కింగ్స్‌పైనే:

ఆ ఒక్క విజయం కింగ్స్‌పైనే:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఐపీఎల్ 2021లో ఒక మ్యాచులో కూడా సత్తాచాటలేదు. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది. 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఐపీఎల్ 2021లో కేన్ సేన సాధించిన ఏకైక విజయం పంజాబ్ కింగ్స్‌పైనే. అది మొదటి దశలో వచ్చింది. పంజాబ్ జట్టును ఎస్‌ఆర్‌హెచ్ 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తరువాత సన్‌రైజర్స్ వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇక ఇప్పటి నుంచి వరుసగా అన్ని మ్యాచులు గెలిచినా.. ప్లే ఆఫ్‌కు చేరుకోవడం అసాధ్యమే. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి.

 వార్నర్ ఔట్:

వార్నర్ ఔట్:

టాప్​ ఆర్డర్​లో రాణిస్తారనుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్‌, కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌, స్టార్ బ్యాటర్ మనీశ్‌ పాండే తక్కువ స్కోరుకే పరిమితమవుతున్నారు. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2021లో వార్న‌ర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. తొలి దశలో ఒక మ్యాచుపై వేటు పడగా.. జానీ బెయిరిస్టో అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీపై వార్నర్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచులో డకౌట్ అయ్యాడు. దాంతో అతడిపై మరోసారి వేటు పడనుంది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. డేవిడ్ భాయ్ దాదాపు ఈ మ్యాచ్ ఆడకపోవచ్చు.

రషీద్‌ ఖాన్‌ మినహా:

రషీద్‌ ఖాన్‌ మినహా:

సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్‌, మనీశ్‌ పాండేలు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ గాడిలో పడాలి. హైదరాబాద్ జట్టులో సైనా బ్యాటర్లు లేకపోవడంతో జాదవ్ తుది జట్టులో ఉంటున్నాడు. అబ్దుల్ సమద్ మరోసారి పరుగులు చేయాలని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలర్లో రషీద్‌ ఖాన్‌ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నట్టు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ తమ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. జాసన్ హోల్డర్ స్థానంలో కూడా జేసన్ రాయ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్​లోనైనా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి, అదృష్టం తోడుంటే విజయం దక్కుతుంది. లేదంటే మళ్లీ కథ కంచికే.

 సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):

డేవిడ్ వార్నర్/ జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్/జేసన్ రాయ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.

Story first published: Saturday, September 25, 2021, 10:26 [IST]
Other articles published on Sep 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X