వేలం ముగిసింది: సన్‌రైజర్స్ పొదుపుగా తయారైంది!!

IPL 2019 : Sunrisers Hyderabad Complete Squad | Oneindia Telugu
Sunrisers Hyderabad complete squad: Heres the full list of SRH players after IPL 2019 auctions

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించి జరిగిన వేలంలో సన్‌రైజర్స్ అదుపుగా ఉంటూ పొదుపుగా వ్యవహరించింది. ఒకానొక దశలో ఖాతాలో నగదు సరిపోకపోవడంతో మిగిలిన ఫ్రాంచైజీలతో పాటు పోటీ పడలేకపోయింది. ఈ క్రమంలో ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకునే వీలున్నప్పటికీ ముగ్గురిని మాత్రమే కొనుగోలు చేసింది. తుది జట్టు కూర్పునకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆసక్తి చూపింది. హిట్టర్ ధావన్ లోటును తీర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించి సఫలమైంది.

హిట్టర్ స్థానంలో గఫ్తిల్‌ను జట్టులోకి

హిట్టర్ స్థానంలో గఫ్తిల్‌ను జట్టులోకి

సాహాను రూ.1.2 కోట్లకు తిరిగి దక్కించుకున్న సన్‌రైజర్స్.. జానీ బెయిర్ స్టో (రూ.2.2 కోట్లు) రూపంలో విదేశీ వికెట్ కీపర్‌ను కొనుగోలు చేసింది. కోటి రూపాయలకు మార్టిన్ గప్టిల్‌ను కొనుగోలు చేయడం ద్వారా హిట్టర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు అయింది.

ధావన్‌ను భర్తీ చేయాలని పోరాడినా..

ధావన్‌ను భర్తీ చేయాలని పోరాడినా..

తానంతటే తానే ధర నచ్చలేదని ఢిల్లీకి వెళ్లిపోయిన ధావన్ స్థానాన్ని భర్తీ చేసే ఉద్దేశంతో.. కాలిన్ ఇన్‌గ్రామ్‌ను కొనుగోలు చేయాలనుకుంది. దాని కోసం చివరివరకూ ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. హైదరాబాద్ దగ్గర రూ.9.7 కోట్లు ఉండగా.. అతడి కోసం రూ.6 కోట్ల వరకే కేటాయించాలని నిర్ణయించుకుంది. ఒక వేళ వార్నర్ దూరమైనా.. ఇన్‌గ్రామ్‌తో ఆ లోటు భర్తీ చేయొచ్చని భావించింది. కానీ పర్స్ వాల్యూ తక్కువ ఉండటంతో వెనక్కి తగ్గింది. ఈ ఒక్క విషయంలోనే సన్‌రైజర్స్ శిబిరంలో అసంతృప్తి కనిపించింది.

హైదరాబాద్ పూర్తి జట్టు

హైదరాబాద్ పూర్తి జట్టు

ధావన్ బదులు విజయ్ శంకర్, షహబాజ్ ఖాన్, అభిషేక్ శర్మ‌లను ఢిల్లీ సన్‌రైజర్స్‌కు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్లో ఆడిన 17 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ జట్టు ఇలా ఉంది.

జట్టు: భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, విలియ్సమన్, రషీద్ ఖాన్, షకీబ్ అల్ హసన్, మనీష్ పాండే దీపక్ హుడా, సిద్దార్థ్ కౌల్, శ్రీవాస్తవ్ గోస్వామి (కీపర్), ఖలీల్ అహ్మద్, యూసుఫ్ పఠాన్, బసిల్ థంపి, నటరాజన్, రికీ భుయ్, సందీప్ శర్మ, మహ్మద్ నబీ, బిల్లీ స్టాన్లేక్, విజయ్ శంకర్, షహబాజ్ ఖాన్, అభిషేక్ శర్మ‌, వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్ స్టో, మార్టిన్ గప్టిల్.

ఐపీఎల్ వేలం 2019 విశేషాలు: కొందరికి జాక్‌పాట్, మరికొందరికి నిరాశ

వేలంలో ఏం జరిగిందంటే

వేలంలో ఏం జరిగిందంటే

జానీ బెయిర్ స్టో (ప్రారంభ ధర రూ1.50 కోట్లు) - రూ 2.20 కోట్లు

వృద్ధిమాన్ సాహా (ప్రారంభ ధర రూ1 కోటి) - రూ 1.20 కోట్లు

మార్టిన్ గఫ్తిల్ (ప్రారంభ ధర రూ1కోటి) - రూ 1 కోటి

మార్చుకున్న ప్లేయర్ల వివరాలు: శిఖర్ ధావన్‌ను ఇచ్చేసి విజయ్ శంకర్, షహబాజ్ ఖాన్, అభిషేక్ శర్మ‌లను తీసుకుంది.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: David Warner, Yusuf Pathan, Rashid Khan, Shakib Al Hasan, Billy Stanlake, Kane Williamson, Mohammad Nabi, Bhuvneshwar Kumar, Manish Pandey, T Natarajan, Ricky Bhui, Sandeep Sharma, Shreevats Goswami, Siddarth Kaul, Khaleel Ahmed, Basil Thampi, Deepak Hooda

వేలంలో ఖర్చు చేసింది: రూ 4.40 కోట్లు

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, December 19, 2018, 8:34 [IST]
Other articles published on Dec 19, 2018
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more