ఐపీఎల్ వేలం 2019 విశేషాలు: కొందరికి జాక్‌పాట్, మరికొందరికి నిరాశ

IPL 2019 Auction Live

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ వేలం ముగిసింది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్‌లో మంగళవారం జరిగింది. గత పదకొండు సీజన్లలో వేలానికి వ్యాఖ్యాతగా వ్యవహారించిన రిచర్డ్ హ్యాడ్లీ స్థానంలో ఈసారి హ్యూస్‌ ఎడ్‌మెయిడాస్‌ వేలం నిర్వహించారు.

ఐపీఎల్ వేలం 2019: తేదీ, సమయం, వేదిక, నియమాలు తెలుసుకోవాలనుందా..

ప్రపంచవ్యాప్తంగా 1,003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 351 మందితో కూడిన తుది జాబితాను ప్రకటించింది. 118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెట‌ర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు.

ఐపీఎల్ 2019 వేలానికి సంబంధించిన అప్‌డేట్స్ మీకోసం:

Auto Refresh Feeds
09:11 pm

ఐపీఎల్ 2019 వేలం ముగిసింది.

09:10 pm

రేయాన్ పరాగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

09:09 pm

ఆష్టన్ టర్నర్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

09:09 pm

మనన్ వోహ్రాని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

09:06 pm

శ్రీకాంత్ ముదేను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

09:05 pm

బండారు అయ్యప్పని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

09:01 pm

జోయ్ డెన్లేని రూ. కోటికి కోల్‌కతా సొంతం చేసుకుంది.

09:01 pm

శుభమ్ రంజనేను రూ. 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

09:00 pm

మురుగన్ అశ్విన్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

09:00 pm

తుషార్ దేశ్ పాండేను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

08:59 pm

జలజ్ సక్సేనాను రూ. 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

08:38 pm

ఐపీఎల్ 2019 వేలానికి 10 నిమిషాల విరామం

08:31 pm

అక్షదీఫ్ నాథ్‌ను రూ. 3.6 కోట్లకు కోనుగోలు చేసిన ఆర్సీబీ.

08:26 pm

రెండోసారి యువీని రూ.కోటికి సొంతం చేసుకున్న ముంబై

08:25 pm

రెండోసారి కూడా మనోజ్ తివారికి నిరాశే. ఆసక్తి చూపని ప్రాంఛైజీలు

08:24 pm

రెండోసారి వేలంలో మార్టిన్ గుప్టిల్‌ను రూ.కోటికి దక్కించుకున్న హైదరాబాద్

08:21 pm

అగ్నివేష్ ఆయాచి, హర్ ప్రీత్ బ్రార్‌లను రూ.20 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది.

08:19 pm

ప్రయాస్ రే బర్మన్‌ను రూ. 1.5 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

08:15 pm

వెస్టిండిస్ ఆటగాడు కీమో పాల్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

08:15 pm

లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ. 50 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

08:14 pm

పృథ్విరాజ్ యర్రాను రూ. 20 లక్షలకు కోల్‌కతా సొంతం చేసుకుంది.

08:13 pm

రసిక్ ఢర్‌ను రూ. 20 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది.

08:13 pm

కనీసధర రూ.20 లక్షలతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 4.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

08:07 pm

లలిత్ యాదన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

08:06 pm

శశాంక్ సింగ్‌ను రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.

08:05 pm

సాయిరాజ్ పాటిల్, స్వప్నిల్ సింగ్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

08:04 pm

దర్శన్ నాల్కండేను రూ. 30 లక్షలకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది.

08:03 pm

మిలింద్ కుమార్‌ను రూ.20 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

08:03 pm

పంకజ్ జైస్వాల్‌ను రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

08:02 pm

హ్యారీ గుర్నేను రూయ 75 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.

08:02 pm

ఆష్టన్ టర్నర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

08:01 pm

కనీస ధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన సికిందర్ రాజాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

08:00 pm

జస్‌కర్ణ్ సింగ్, సందీప్ వారియర్, ఫాబిన్ అలెన్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

07:59 pm

అర్షదీప్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది.

07:58 pm

విష్ణు వినోద్ ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

07:58 pm

నిఖిల్ నాయక్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

07:57 pm

హిమ్మత్ సింగ్‌ను రూ. 65 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది.

07:56 pm

హిమన్షు రాణాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

07:54 pm

హార్డిస్ విల్జోన్‌ను రూ. 75 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.

07:54 pm

రూ. 1.1 కోటికి ఓషానే టోమస్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

07:53 pm

డాన్ క్రిస్టియన్, మన్ ప్రీత్ గోనే, అలీ ఖాన్, జేమ్స్ ప్యాటిన్ సన్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

07:52 pm

ఖయాస్ అహ్మద్, సత్యజిత బచావ్, జోయ్ డెన్లే, రైలీ రూస్కూ లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

07:48 pm

అనిర్జ్ నోర్జ్జే‌ను రూ.20 లక్షలకు కోల్‌కతా సొంతం చేసుకుంది.

07:46 pm

కనీసధర రూ. 40 లక్షలతో వేలంలోకి వచ్చిన షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

07:45 pm

ప్రవీణి దుబే, శుభమ్ రంజనీలను కొనుగోలుచేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

07:41 pm

ఐపీఎల్ 2019 వేలం తిరిగి ప్రారంభమైంది.

07:10 pm

ఐపీఎల్ 2019 వేలంలో టీ విరామం. తిరిగి 7:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.

07:10 pm

ప్రాంఛైజీల వద్ద మిగిలిన నగదు: KKR : 8.60 crore RR : 10.15 crore CSK : 3.40 crore RCB : 7.75 crore KXIP : 10.35 crore SRH : 6.30 crore DC : 10.60 crore MI : 4.95 crore

06:46 pm

ప్రతి ఒక్క ప్రాంఛైజీ కూడా 7 నుంచి 15 వరకు ప్లేయర్లను సమర్పించాల్సి ఉంది.

06:42 pm

కనీసధర రూ.కోటిన్నరతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

06:41 pm

కనీసధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ ఆటగాడు లూకీ ఫెర్గూన్‌సన్‌ను రూ. 1.6 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.

06:40 pm

కనీసధర రూ. కోటిన్నరతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాడు మోర్నీ మోర్కెల్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

06:39 pm

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అభిమన్యు మిథున్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

06:38 pm

అమ్ముడుపోని ఆటగాడిగా కేన్ రిచర్డ్‌సన్.

06:38 pm

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన కర్ణాటక రంజీ కెప్టెన్ వినయ్ కుమార్‌ను ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు.

06:37 pm

కనీసధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన బరీందర్ శ్రణ్‌ను రూ. 3.4 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

06:34 pm

అమ్ముడుపోని ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్

06:33 pm

హెన్రిచ్ క్లాసెన్‌ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న అర్సీబీ

06:33 pm

అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీలంక ఆటాగడు కుశాల్ పెరీరా

06:32 pm

ఐపీఎలీ వేలంపై సతీష్ మీనన్

06:31 pm

లూక్ రోంచి, ముష్ఫికర్ రహీంను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

06:30 pm
Mykhel

కనీసధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన శామ్ కర్రన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ, బెంగళూరు పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరకు రూ. 7.2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది.

06:24 pm

కనీసధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన వెస్టిండిస్ ఆటగాడు జాసన్ హోల్డర్‌ని ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు

06:24 pm

పర్వేజ్ రసూల్‌ను ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు

06:23 pm

అమ్ముడుపోని ఆటగాడిగా కోరీ అండర్సన్‌

06:22 pm

కనీసధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన రిషి ధావన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు

06:22 pm

శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు

06:21 pm

కనీసధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన జేమ్స్ నీషమ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

06:20 pm

అమ్ముడుపోని ఆటగాడిగా దక్షణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా

06:19 pm

షాన్ మార్ష్, సౌరభ తివారీని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

06:18 pm
Mykhel

కనీసధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికాకు చెందిన కొలిన్ ఇంగ్రన్‌ను రూ. 6.4 కోట్లకు కొనుగోలు చేసింది.

06:14 pm

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన రీజా హెండ్రిక్స్‌ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

06:13 pm

ఆప్ఘన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు.