న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడం ఏంది? బూతులు వస్తున్నాయి: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar Upset With Kuldeep Yadavs Exclusion in 2nd Test against Bangladesh

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న కుల్దీప్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం దారుణమని మండిపడ్డాడు.

అసలు ఈ నిర్ణయం నమ్మశక్యంగా లేదని, నోటి నుంచి బూతులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. కుల్దీప్ యాదవ్‌కు బదులు జయదేవ్ ఉనాద్కత్‌‌ను తీసుకుంది. తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాస్ సందర్భంగా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.

బూతులు వస్తున్నాయి..

బూతులు వస్తున్నాయి..

టాస్ ముగిసిన వెంటనే ఈ నిర్ణయంపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గెలిచిన ప్లేయర్‌‌ను పక్కనబెట్టడం నమ్మశక్యంగా లేదు. ఇది చాలా దారుణం. చెప్పడానికి నాకు మంచి మాటలు కూడా రావడం లేదు, ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయేమో. తొలి టెస్టులో 20 వికెట్లలో 8 వికెట్లు తీసిన బౌలర్‌ను పక్కనబెట్టేస్తారా? ఇద్దరు స్పిన్నర్లకు తుది జట్టులో అవకాశం ఇచ్చినప్పుడు అక్షర్ పటేల్‌ను లేదా రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనబెట్టొచ్చు.

ఇది చాలా అన్యాయం..

ఇది చాలా అన్యాయం..

8 వికెట్లు తీసిన బౌలర్‌ను తీయడం మాత్రం అన్యాయం. పిచ్‌తో సంబంధం లేకుండా రాణించిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కకపోతే ప్లేయర్‌ ఎలా ఫీలవుతాడు? ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెంచి, వాళ్లు మరింత మెరుగ్గా రాణించేలా చేయడం టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యత. కానీ భారత జట్టు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అద్భుతంగా రాణించిన ప్లేయర్లను పక్కనబెట్టి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది.' అని రాహుల్ ద్రవిడ్ తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.

బ్యాటింగ్ డెప్త్ కోసమే..

బ్యాటింగ్ డెప్త్ కోసమే..

ఇక బ్యాటింగ్ డెప్త్ కోసమే అక్షర్ పటేల్, అశ్విన్‌లను జట్టులో కొనసాగించినట్లు తెలుస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ఢాకా వికెట్‌పై మణికట్టు స్పిన్నర్ల ప్రభావం తక్కువ అని భావించిన టీమిండియా.. కుల్దీప్‌ను బెంచ్‌కు పరిమితం చేసింది. బంగ్లాలో లెఫ్టార్మ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో అశ్విన్‌ను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉనాద్కత్, అశ్విన్ దోబార్..

ఉనాద్కత్, అశ్విన్ దోబార్..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్..172 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మోమినల్ హక్(119 బంతుల్లో 11 ఫోర్లతో 65 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రీజులో మోమినల్ హక్‌తో మెహ్‌దీ హసన్ మీరాజ్(4 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, December 22, 2022, 13:55 [IST]
Other articles published on Dec 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X