న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఘనతను అందుకోవడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టే: సునీల్ గవాస్కర్

 Sunil Gavaskar says Completing 10,000 runs was like climbing Mt Everest

న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకోవడం అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనట్లేనని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఈ ఘనతను అందుకున్న నేపథ్యంలో లిటిల్ మాస్టర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జో రూట్‌ సెంచరీతో ఈ ఘనత అందుకున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఘనతను తొలిసారి అందుకున్నది మాత్రం భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌‌తో మాట్లాడిన గవాస్కర్... తన చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకున్నాడు.

 ఎవరెస్ట్ ఎక్కినట్లే...

ఎవరెస్ట్ ఎక్కినట్లే...

'ఈ ఘనత సాధించడానికి నాకు ఇంకా 57 పరుగులు అవసరమని తెలుసు. నేను సాధారణంగా స్కోర్‌బోర్డ్‌ను చూడను. అయితే నేను అర్ధసెంచరీ సాధించాక అహ్మదాబాద్‌‌లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారు. చారిత్రక మైలురాయిని అందుకోవడానికి మరో ఏడు పరుగులు అవసరమని అప్పడే గ్రహించాను. టెస్టులో పది వేల పరుగులు సాధించడం అంత సులువైన పని కాదు. ఈ ఐదు అంకెల పరుగులు సాధిస్తే తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే.

షాంపైన్ తాగాం..

షాంపైన్ తాగాం..

నేను 10,000 పరుగులను త్వరగా పూర్తి చేయాలని భావించాను. మిగతా ఆటగాళ్లు కూడా ఈ ఘనతను సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఘనత సాధించినప్పడు మేం అహ్మదాబాద్‌లో ఉన్నాం. అయితే ఈ రికార్డును సెలబ్రేట్‌ చేసుకోవడానికి మా జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ప్రత్యేక అనుమతితో షాంపైన్‌ తీసుకుని వచ్చాడు. అయితే ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌లు టెస్ట్ మ్యాచ్ మధ్యలో షాంపైన్ తాగడానికి అనుమతిస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు 'అని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు.

గెలిపించిన రూట్..

గెలిపించిన రూట్..

జో రూట్‌ ( 170 బంతుల్లో 12 ఫోర్లతో 115 నాటౌట్‌) వీరోచిత శతకంతో సత్తాచాటడంతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ అద్భుత విజయం సాధించింది. ఊహించని మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో ఆదివారం ఇంగ్లండ్‌ అయిదు వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుచేసి, మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 216/5తో నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. ఇంకో 13.5 ఓవర్లాడి, మరో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని (277) చేరుకుంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (32 నాటౌట్‌; 92 బంతుల్లో 3×4) అయిదో వికెట్‌కు అజేయంగా 120 పరుగులు జోడించారు.

Story first published: Monday, June 6, 2022, 20:18 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X