న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brisbane Test: అలా చేస్తే.. టీమిండియా తప్పకుండా గెలుస్తుంది: గవాస్కర్

Sunil Gavaskar said Team India bowlers restrict Australia to 200 then Rahane team look for a win

బ్రిస్బేన్‌: సిరీస్ డిసైడర్ అయిన చివరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు పోటాపోటీగా ఆడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 369 పరుగులు చేయగా.. టీమిండియా 336 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అయితే బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 200 పరుగులలోపే కట్టడి చేయాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్ సూచించాడు. అలానే ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వీలైనంత తొందరగా పెవిలియన్‌కు చేర్చాలని సూచించాడు.

200 పరుగులకే ఆలౌట్‌ చేయాలి:

200 పరుగులకే ఆలౌట్‌ చేయాలి:

'భారత్ గొప్పగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను 200 పరుగులకే ఆలౌట్‌ చేయాలి. అప్పుడు చివరి రోజు టీమిండియా 250 పరుగులను సునాయాసంగా ఛేదించగలదు. డేవిడ్ వార్నర్‌ను తొందరగా ఔట్ చేయాలి. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. వార్నర్ వేగంగా పరుగులు సాధించగలడు. అయితే నాలుగో రోజు ఆటలో భారత్‌ బౌలర్లు చెలారేగుతారని ఆశిస్తున్నా. అలా చేస్తే, మన బ్యాట్స్‌మెన్‌ మిగిలిన పనిని పూర్తిచేసి ఘనవిజయం సాధిస్తారు. బౌలర్లు తప్పక సత్తాచాటుతారని నేను చెప్పట్లేదు. కానీ మంచి ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నా' అని గవాస్కర్ తెలిపాడు.

టెయిలెండర్లపై ప్రశంసలు:

టెయిలెండర్లపై ప్రశంసలు:

టీమిండియా టెయిలెండర్లను సునీల్ గవాస్కర్ కొనియాడాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు అంత తేలిగ్గా వికెట్లు ఇవ్వలేదని అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఆట‌గాళ్లు శార్దూల్ ఠాకూర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు అద్భుత‌మైన పోరాటం చేసిన విషయం తెలిసిందే. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా పరుగులు రాబట్టలేకపోయిన చోట సుందర్‌, శార్దూల్‌ ఆకట్టుకున్నారు. మొదట శార్దూల్‌ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. కాసేపటికే సుందర్‌ ఫిఫ్టీ మార్క్‌ను చేరాడు. ఏడో వికెట్‌కు రికార్డు స్థాయి భాగస్వామ్యం నమోదు చేశాక శార్దూల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. చివర్లో‌ సిరాజ్‌ (13) కొన్ని విలువైన పరుగులు జోడించాడు.

123 పరుగులకే నాలుగు వికెట్లు:

123 పరుగులకే నాలుగు వికెట్లు:

గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 31వ ఓవర్‌లో మొహ్మద్ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బతీశాడు. మూడో బంతికి లబుషేన్ ‌(25)ను పెవిలియన్‌కు చేర్చిన సిరాజ్..ఆఖరి బంతికి మాథ్యూ వేడ్ (0)ను ఔట్ చేశాడు. క్రీజులో స్మిత్ (9), గ్రీన్‌ (1) ఉన్నారు. ఆసీస్‌ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత్ కంటే 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరి సన్నీ చెప్పినట్టు వార్నర్ (48)ను ఔట్ చేసిన మన బౌలర్లు.. 200లోపు కట్టడి చేస్తారేమో చూడాలి.

సిరీస్ 1-1తో సమం:

సిరీస్ 1-1తో సమం:

ప్రస్తుతం సిరీస్ 1-1తో సమానంగా ఉంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. ఇక ఓడిపోతుందనుకున్న మూడో టెస్టులో టీమిండియాను హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌ తమ పోరాటంతో గట్టెంకించడంతో 'డ్రా'గా ముగిసింది. చివరి టెస్టులో గెలిచిన వాళ్లదే సిరీస్. ప్రస్తుతానికి గబ్బా టెస్ట్ ఫలితం వచ్చే విధంగా ఉంది.

సూపర్ సిరాజ్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు! ఆధిక్యం 163!!

Story first published: Monday, January 18, 2021, 8:08 [IST]
Other articles published on Jan 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X