న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైకి కమిషనర్‌గా సునీల్ గవాస్కర్, అంబాసిడర్‌గా సచిన్

Sunil Gavaskar named commissioner of T20 Mumbai League

హైదరాబాద్: టీమిండియా లెజండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ ప్రత్యేక గౌరవం దక్కింది. టీ20 ముంబై లీగ్‌ ప్రారంభ సీజన్‌కు దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. గవాస్కర్‌ను లీగ్‌ కమిషనర్‌గా నియమించిన సంగతిని ముంబై క్రికెట్‌ సంఘం, ప్రాబబిలిటీ స్పోర్ట్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంయుక్తంగా మీడియాకు వెల్లడించాయి.

టెస్టు క్రికెట్ 10000పరుగులు:

టెస్టు క్రికెట్ 10000పరుగులు:

భారత్‌ తరఫున టెస్టుల్లో 10,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌ సునిల్‌ గవాస్కర్. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నగర క్రికెట్‌ చరిత్రలో టీ20 ముంబై లీగ్‌ ఒక కీలక మైలురాయి. ప్రారంభ ఎడిషన్‌లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ముంబై కుర్రాళ్లలో చాలా ప్రతిభ ఉంది. యువ క్రికెటర్ల సత్తా, నైపుణ్యాలు ప్రదర్శించేందుకు యువ క్రికెటర్లకు ఈ లీగ్‌ అవసరమే వేదిక కానుంది' అని తెలిపారు.

ముంబై పరిధిలోని ఆటగాళ్ల కోసం:

ముంబై పరిధిలోని ఆటగాళ్ల కోసం:

స్టార్ క్రికెటర్లు తమ సత్తా చాటేందుకు:లీగ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సహకారంతో ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబై పరిధిలోని ఆటగాళ్ల కోసం ఈ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, అజింక్య రహానె, పృథ్వీషా, రహానె, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు కుర్రాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

మంచి ఫ్లాట్‌ఫామ్‌గా :

మంచి ఫ్లాట్‌ఫామ్‌గా :

ఇటీవలే వేలం ముగిసింది. ఆరు జట్లు వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌లు ఆడతాయి. టోర్నమెంట్ మార్చి 11 నుంచి 21 మధ్య జరగనుంది. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ... ముంబై క్రికెట్ అపారమైన ప్రతిభతో దూసుకెళ్తోంది. కుర్రాళ్లు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి, వారి నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఈ లీగ్ మంచి ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వ్యాఖ్యాతగా రాణిస్తున్న సన్నీ:

వ్యాఖ్యాతగా రాణిస్తున్న సన్నీ:

లీగ్‌లో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సన్నీ వ్యాఖ్యాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

బ్యాటింగ్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుర్రాళ్ల కోసం మరోసారి అంబాసిడర్ కాబోతున్నారు.

క్రికెట్‌కు అంబాసిడర్‌గా:

క్రికెట్‌కు అంబాసిడర్‌గా:

తన సుధీర్ఘ కెరీర్‌లో ఎన్నో సంస్థలు, కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆయన ఈ సారి కుర్రాళ్ల క్రికెట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. మార్చి నెలలో జరగనున్న టీ20 ముంబై లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు మాస్టర్ బ్లాస్టర్ నిర్ణయించుకున్నారు.

Story first published: Tuesday, March 6, 2018, 14:36 [IST]
Other articles published on Mar 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X