న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్ధిక్ పాండ్యా పనైపోయింది: పక్కన పెట్టడం బెటర్: ఆ ఇద్దరితో రీప్లేస్: గవాస్కర్

Sunil Gavaskar chooses Deepak Chahar and Bhuvneshwar Kumar for replace Hardik Pandya
Hardik Pandya Replacement - Deepak Chahar And Bhuvneshwar Kumar | Oneindia Telugu

ముంబై: హార్దిక్ పాండ్యా..టీమిండియా ఆల్‌రౌండర్. బంతితో, బ్యాట్‌తో చెలరేగిపోయే సత్తా ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్. భారీ షాట్లను ఆడటంలో దిట్ట. చూడ్డానికి బలహీనంగా కనిపించినప్పటికీ.. బలమైన షాట్లను బాదగలడు. మెరుపు వేగంతో బంతిని ఫెన్సింగ్ దాటించగలడు. ఆశ్చర్య పరిచేలా ఉంటుంది అతని స్ట్రైక్ రేట్. సగటున 130 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించనూ గలడు. అలాంటి ఆల్‌రౌండర్ ఇఫ్పుడు విమర్శల జడివానలో తడిచి ముద్దవుతున్నాడు. జట్టుకు భారంగా మారడనే అపవాదును ఎదుర్కొంటోన్నాడు. ఫామ్‌ను కోల్పోవడంతో విమర్శలకు అతణ్ని టార్గెట్ చేశారు.

ఆ ఇద్దరితో హార్దిక్ రీప్లేస్..

ఆ ఇద్దరితో హార్దిక్ రీప్లేస్..

లెజెండరీ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా పాండ్యాకు రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికోసం ఆయన ఇద్దరి పేర్లను సైతం సూచించారు. హార్దిక్ పాండ్యాకు బదులుగా ఆ ఇద్దరికీ ఆల్‌రౌండర్ హోదాను కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నిలకడగా రాణిస్తోండటమే దీనికి కారణమన వివరించారు.

దీపక్ చాహర్, భువిలకు ఆల్‌రౌండర్ హోదా..

దీపక్ చాహర్, భువిలకు ఆల్‌రౌండర్ హోదా..

హార్దిక్‌ను దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్‌లతో రీప్లేస్ చేయాలని సూచించారాయన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ప్లేయర్ అతను. ప్రధానంగా అతని ఆయుధం బౌలింగ్. ఐపీఎల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తోన్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడా నిలకడగా ఫామ్‌ను కొనసాగిస్తోన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను అర్ధసెంచరీతో గట్టెక్కించాడు దీపక్ చాహర్.

రెండో వన్డేను గెలిపించిన బౌలర్ల ద్వయం..

రెండో వన్డేను గెలిపించిన బౌలర్ల ద్వయం..

లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను పక్కా ప్రొఫెషనల్‌గా ఆడాడు. 82 బంతుల్లో 69 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఒక సిక్సర్, ఏడు ఫోర్లు ఉన్నాయి. అదే మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ సైతం బ్యాటింగ్‌లో రాణించాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లతో 19 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టును విజయ తీరాలకు చేర్చారు.. దీపక్ చాహర్, భువి. వారిద్దరూ లేకుంటే ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోయి ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు.

సునీల్ గవాస్కర్ సజెషన్స్..

సునీల్ గవాస్కర్ సజెషన్స్..

ఈ ఇన్నింగ్- వారిద్దరినీ ఆల్‌రౌండర్లుగా నిలిపిందని తాజాగా సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పాండ్యాను దీపక్ చాహర్, భువనేశ్వర్‌ కుమార్‌లతో ఇప్పటికప్పుడు రీప్లేస్ చేయాలని సూచించారు. భువనేశ్వర్ కుమార్ ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్‌తో తాను ఈ అభిప్రాయానికి రాలేదని, ఇదివరకు బ్యాటింగ్‌లో కొన్ని మెరుపు ఇన్నింగ్‌లను ఆడాడని చెప్పుకొచ్చాడు. రెండు, మూడేళ్ల కిందట శ్రీలంకలో మహేంద్రసింగ్ ధోనీతో కలిసి భువనేశ్వర్ కుమార్ జట్టును గెలిపించాడని, అలాంటి ఇన్నింగ్‌‌ను రెండోవన్డేలో చూశామని అన్నారు.

Story first published: Wednesday, July 28, 2021, 14:52 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X