న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ పదవికి డేవిడ్ పీవెర్ రాజీనామా

Stung by Longstaff report, Cricket Australia Chairman David Peever steps down

హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియాలో ఊహించని పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ పదవి నుంచి డేవిడ్ పీవెర్ తప్పుకున్నాడు. ఎథిక్స్ కమిటీకి చెందిన సిమన్ లాంగ్‌స్టాఫ్ సోమవారం బాల్ ట్యాంపరింగ్ గురించి రివ్యూను విడుదల చేశారు. ఈ వివాదంలో ఆటగాళ్లతో సమానంగా బోర్డు పాలకులు కూడా శిక్షను భరించాలని ఈ రివ్యూ సూచించింది.

5వ వన్డే: టాస్ గెలిచిన విండిస్, కెప్టెన్ కోహ్లీ రికార్డు మిస్5వ వన్డే: టాస్ గెలిచిన విండిస్, కెప్టెన్ కోహ్లీ రికార్డు మిస్

దీంతో గురువారం జరిగిన బోర్డు సమావేశంలో డేవిడ్ పీవెర్ తన రాజీనామాను సమర్పించాడు. ఇటీవలే మూడేళ్ల కాలానికి డేవిడ్ పీవెర్ క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియాకు కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునే వరకు ఆ స్థానంలో డిప్యూట్ ఛైర్మన్‌గా ఉన్న ఎర్ల్ ఎడ్డింగ్స్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

"డేవిడ్ సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంతో డేవిడ్ కీలకపాత్ర పోషించాడు. ఐసీసీ పుల్ టైమ్ మెంబర్ దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియాల్లో ఫండింగ్ వృద్ధి చెందడంలో ముఖ్యభూమిక పోషించాడు" అని ఎడ్డింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగులోకి రాగా బాన్‌క్రాఫ్ట్‌పై ఆరు నెలలు, కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ముగిశాక.. చీఫ్ కోచ్ పదవి నుంచి డారెన్ లెమన్ తప్పుకోవడంతో.. జస్టిస్ లాంగర్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు.

అనంతరం ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమ్స్ సందర్లాండ్ కూడా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 1, 2018, 15:44 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X