న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes Series: వార్న‌ర్‌పై కొన‌సాగుతున్న బ్రాడ్ అధిప‌త్యం.. ఏకంగా 13 సార్లు ఔట్

Stuart Broad out David Warner 13 times

ఇంగ్లండ్ సీనియ‌ర్ పేస‌ర్ స్టువ‌ర్టు బ్రాడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా నేడు మొద‌లైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్‌ వార్న‌ర్‌ను స్టువ‌ర్టు బ్రాడ్ ఔట్ చేశాడు. 72 బంతుల్లో 30 ప‌రుగులు(6 ఫోర్లు) చేసిన వార్న‌ర్.. బ్రాడ్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఫీల్డ‌ర్ జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో వార్న‌ర్‌ను ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌల‌ర్‌గా బ్రాడ్ రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు యాషెస్ సిరీస్‌ల్లో వార్న‌ర్‌ను రికార్డు స్థాయిలో బ్రాడ్ 13 సార్లు ఔట్ చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో డేవిడ్ వార్న‌ర్‌పై బ్రాడ్ అధిపత్యం కొన‌సాగుతుంది. అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో వార్న‌ర్‌ను ఎక్కువ‌సార్లు ఔట్ చేసిన బౌల‌ర్ల జాబితాలో బ్రాడ్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. బ్రాడ్ త‌ర్వాత రెండో స్థానంలో ప‌దేసి సార్లతో టీమిండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, మ‌రో ఇంగ్లండ్ సీనియ‌ర్ పేస‌ర్ అండ‌ర్స‌న్ ఉన్నారు. ఆ త‌ర్వాత మూడో స్థానంలో వార్న‌ర్‌ను 6 సార్లు ఔట్ చేసిన టీమిండియాకు చెందిన ఉమేష్ యాదవ్ ఉన్నాడు. ఇక 5 సార్లు ఔట్ చేసి న్యూజిలాండ్ బౌల‌ర్ నీల్ వాగ్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఉద‌యం నుంచి మ్యాచ్‌కు ప‌లు మార్లు వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 35 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో మార్క‌స్ హ‌రీస్ 36 ప‌రుగుల‌తో, ల‌బుశేన్ 21 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. అంత‌కుముందు ఆస్ట్రేలియాకు మార్క‌స్ హ‌రీస్, డేవిడ్ వార్న‌ర్ శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్ద‌రు క‌లిసి తొలి వికెట్‌కు 51 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ క్ర‌మంలో 30 ప‌రుగులు చేసిన వార్న‌ర్‌ను బ్రాడ్ ఔట్ చేసి వీరి భాగ‌స్వామ్యాన్ని విడ‌దీశాడు.

Joe Root Captaincy పై Ricky Ponting సీరియస్ | The Ashes

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు:
మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ ల‌బుశేన్, స్టీవెన్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీప‌ర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
ఇంగ్లండ్ తుది జ‌ట్టు:
హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్‌), బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్), మార్క్ వుడ్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.

Story first published: Wednesday, January 5, 2022, 11:58 [IST]
Other articles published on Jan 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X