న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 
స్టువర్ట్ బ్రాడ్‌కు పనిష్‌మెంట్ విధించిన ఐసీసీ.. డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తుండగా ఆ పని చేశాడని..!

Stuart Broad Breached the ICC Code Of Conduct and He did an Offence of Level 1

లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ మీద ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యులు అధికారికంగా మందలింపు చర్యలు చేపట్టారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని స్టువర్ట్ బ్రాడ్ ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీని ప్రకారం.. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడిపైకి లేదా అతని వైపు అనుచితంగా, ప్రమాదకరంగా బంతిని విసిరితే అందుకు తగ్గ శిక్ష విధించబడుతుంది. ఇక లెవెల్ 1 మందలింపుతో పాటు బ్రాడ్ క్రమశిక్షణ రికార్డు విషయంలో ఒక డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ ఎలైట్ ప్యానెల్ జోడించింది. ఇక 24నెలల వ్యవధిలో స్టువర్ట్ బ్రాడ్ ఎదుర్కొన్న ఇది రెండో మందలింపు చర్య కావడం గమనార్హం. దీంతో అతని డీమెరిట్ పాయింట్లు రెండుకు చేరాయి.

డారిల్ మిచెల్ రన్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపనప్పటికీ..

డారిల్ మిచెల్ రన్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపనప్పటికీ..

ఆదివారం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లోని 89వ ఓవర్‌లో స్టువర్ట్ బ్రాడ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఫీల్డింగ్ టైంలో క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ వైపు ప్రమాదకరంగా బంతిని విసిరాడు. డారిల్ మిచెల్ రన్ తీయడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపనప్పటికీ స్టువర్ట్ బ్రాడ్ అతని వైపు బంతి విసరడాన్ని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యులు సీరియస్‌గా పరిగణించారు.

నేరాన్ని అంగీకరించిన స్టువర్ట్ బ్రాడ్

నేరాన్ని అంగీకరించిన స్టువర్ట్ బ్రాడ్

ఇక తన మీద విధించిన నేరాన్ని బ్రాడ్ అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన డేవిడ్ బూన్ ప్రతిపాదించిన శిక్ష విధింపునకు తన అనుమతి తెలిపాడు. కాబట్టి ఇక అతని మీద అధికారిక విచారణ అవసరం లేదు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు మరైస్ ఎరాస్మస్, రిచర్డ్ కెటిల్‌బరో, థర్డ్ అంపైర్ అలీమ్ దార్, ఫోర్త్ అంపైర్ డేవిడ్ మిల్స్‌లు స్టువర్ట్ బ్రాడ్ మీద ఈ అభియోగాలు మోపారు. ఇక లెవెల్ 1 ఉల్లంఘనలకు అధికారిక మందలింపు‌తో ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50శాతం జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే కొన్ని డీమెరిట్ పాయింట్లు కూడా ఆటగాడి క్రమశిక్షణ రికార్డులో యాడ్ చేస్తారు.

ఈ సిరీస్‌లో 12వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్

ఈ సిరీస్‌లో 12వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్ చక్కని ప్రదర్శన చేశాడు. అతను మూడు మ్యాచ్‌లలో 12వికెట్లు పడగొట్టాడు. అతను మిగతా బౌలర్లకు చక్కని సహాయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, మ్యాటీ పాట్స్, జాక్ లీచ్ ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక జులై 1 నుండి ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో జరగబోయే రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ కోసం బ్రాడ్ సన్నద్ధమవుతున్నాడు.

Story first published: Wednesday, June 29, 2022, 10:05 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X