న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

New Zealand vs Pakistan: వింతైన దృశ్యం.. నగ్నంగా పరిగెత్తుకొచ్చిన అభిమాని! (వీడియో)

Streaker runs on the pitch during NZ vs PAK Test

ఆక్లాండ్: న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ వింత దృశ్యం అటు ఆటగాళ్లకు ఇటు ప్రేక్షకులకు షాకిచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా ఓ వ్యక్తి నగ్నంగా మైదానంలోకి పరిగెత్తుకొని వచ్చేశాడు. తన మర్మాంగాన్ని చేతులతో దాచుకొని మైదానం చుటూ పరుగుతీశాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి రోజే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. అతనిపైకి దూకి మరీ పట్టుకున్నారు. ఇలా మైదానంలోకి నగ్నంగా రావడమే కాకుండా.. తన ఘనకార్యాన్ని మొబైల్‌లో బంధించాడు. సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని ఓ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్(129) కెరీర్‌లో 23వ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 222/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 431 రన్స్‌కు ఆలౌటైంది. జాన్ వాట్లింగ్(73) హాఫ్ సెంచరీతో సత్తా చూపెట్టాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్(56) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

లంచ్ బ్రేక్‌కు ముందు విలియమ్సన్ ఔటైనా.. జేమీసన్(32)తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వాట్లింగ్ జట్టు స్కోర్‌ను 400 దాటించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా యాసిర్ షా మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాక్ ఆట ముగిసేసమయానికి 30/1 స్కోర్ చేసింది. ఈ స్కోర్‌తో మూడో రోజు ప్రారంభించిన పాక్ 82 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసి వెనుకబడింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(59 బ్యాటింగ్), ఫహీమ్ అష్రఫ్(39) ఉన్నారు.

Story first published: Monday, December 28, 2020, 10:36 [IST]
Other articles published on Dec 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X