న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్భజన్ సింగ్ ఒక్కడి వల్లే ఆ సిరీస్ కోల్పోయాం: ఆసీస్ మాజీ కెప్టెన్

Steve Waugh says Harbhajan played cricket the Aussie way
Harbhajan Singh Played Cricket The Aussie Way - Steve Waugh || Oneindia Telugu

సిడ్నీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల జల్లు కురిపించాడు. భజ్జీ సంప్రదాయ స్పిన్నర్‌ కాదని, భిన్నమైన వాడని కొనియాడాడు. అతని ఒక్కడి వల్లే భారత్‌లో జరిగిన 2001 టెస్ట్ సిరీస్‌ను ఓడిపోయామని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2001 టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.

భజ్జీ వల్లే భారత్ గెలిచింది..

'టీమిండియాకు 2001 టెస్ట్ సిరీస్ అందించింది హర్భజన్‌ సింగ్‌. మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసుకున్నాడు. అతని బౌన్స్‌కు మా వద్ద జవాబే లేదు. లెంగ్త్‌కు తోడుగా అద్భుతమైన బౌన్స్‌ అతని సొంతం. ప్రతి స్పెల్‌లో అతను మాపై ఆధిపత్యం చెలాయించాడు. భజ్జికి మంచి స్ట్రైక్‌రేట్‌ ఉంది. ఎక్కువ ఓవర్లు విసిరినా నిలకడ కోల్పోయేవాడు కాదు. భజ్జీని హెడేన్‌ బాగానే ఎదుర్కొన్నా జట్టులోని మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అతనే లేకుంటే మేం సిరీస్‌ గెలిచేవాళ్లం. మాపై అతనికి మెరుగైన రికార్డుంది' అని స్టీవ్‌ వా పేర్కొన్నాడు.

ఆసీస్ తరహా ప్లేయర్..

ఆసీస్ తరహా ప్లేయర్..

భజ్జీ అందరిలాంటి మాములు స్పిన్నర్‌ కాడని స్టీవ్‌ వా ప్రశంసించాడు. బౌన్స్‌తోనే వైవిధ్యం ప్రదర్శించేవాడని గుర్తు చేసుకున్నాడు. అతని బౌలింగ్‌లో తరచూ బ్యాటు, ప్యాడ్‌కు బంతి తగిలి క్యాచ్‌ ఔట్లు అయ్యేవాళ్లమని తెలిపాడు. 'మేమెలాంటి దృక్పథంతో ఆడతామో హర్భజన్‌ సైతం అలాగే ఆడుతాడు. మాలోని స్ఫూర్తి, కసి, పట్టుదల అతనిలో కనిపించేవి. మాతో మేమే ఆడినట్లు అనిపించేది. అందుకే మేం ఔటయ్యేవాళ్లం. అతని మాట, ఆట, దూకుడు, సానుకూలత అన్నీ ఆసీస్ తరహాలోనే ఉండేవి' అని స్టీవ్ వా చెప్పుకొచ్చాడు.

వణికించిన భజ్జీ..

వణికించిన భజ్జీ..

2001 టెస్ట్‌ సిరీస్‌లో భజ్జీ తన బౌలింగ్‌తో ఆసీస్‌ను వణికించాడు. మూడు టెస్ట్‌ల్లో 17.03 సగటుతో 32 వికెట్లు తీశాడు. నాలుగు సార్లు 5 వికెట్లకు పైగా పడగొట్టాడు. కోల్‌కతా టెస్ట్‌లో హ్యాట్రిక్ వికెట్ కూడా సాధించాడు. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను 10 వికెట్లతో గెలిచిన ఆసీస్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. రెండో టెస్ట్‌లో భారత్ 171 పరుగులతో గెలవగా.. ఆఖరి టెస్ట్‌లో రెండు వికెట్లతో విజయాన్నందుకుంది.

Story first published: Friday, January 15, 2021, 13:26 [IST]
Other articles published on Jan 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X