న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ కోహ్లీ గ్రేట్ ప్లేయర్: సచిన్, లారాలతో పోల్చిన స్టీవ్ వా

Steve Waugh Compares Virat Kohli To Sachin Tendulkar And Brian Lara, Calls Him A Great Player

హైదరాబాద్: "సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా ఇద్దరినీ కలిపితే విరాట్ కోహ్లీ" ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ స్టీవ్ వా. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫో‌కు ఇచ్చిన ఇంటర్యూలో విరాట్ కోహ్లీపై స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు.

"కోహ్లీ అద్బుతమైన ఆటగాడు, ప్రతి బిగ్ మూమెంట్‌ను ఎంతగానో ఆస్వాదిస్తాడు. అచ్చం సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా లాగా. వారిలోని అత్యుత్తమ క్రికెట్‌ను బయటకు తీస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ డేంజరస్ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు... ఓ మంచి ఆటగాడు కూడా" అని అన్నాడు.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై స్పందించిన స్టీవ్ వా

రవిశాస్త్రి వ్యాఖ్యలపై స్పందించిన స్టీవ్ వా

ఇటీవలే ఓ మీడియా సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తోన్న భారత జట్టు గత 15 ఏళ్లలో భారత్ చూసిన అత్యుత్తమ జట్టుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రి వ్యాఖ్యలపై స్టీవా స్పందిస్తూ గతంలో తాను ఆడిన భారత జట్లతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కోహ్లీసేన అత్యుత్తమ జట్టని "కచ్చితంగా చెప్పలేను" అని అన్నాడు.

అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న జట్టుతో నేను ఆడా

అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న జట్టుతో నేను ఆడా

"చూడండి... అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న జట్టుతో నేను ఆడాను. అంతకముందు నేను ఏ భారత జట్లతో అయితే ఆడానో ఆ జట్లతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కోహ్లీసేన అత్యుత్తమ జట్టని కచ్చితంగా చెప్పలేను" అని స్టీవ్ వా అన్నాడు. రవిశాస్త్రి జట్టుకు మోరల్ సపోర్టు ఇచ్చేందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఉండాడని క్రికెట విశ్లేషకులు అన్న సంగతి తెలిసిందే.

జట్టుని ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుంది

జట్టుని ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుంది

"నేను కచ్చితంగా చెప్పలేను... ఇది జట్టుని ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుంది. ఎప్పుడైతే జట్టు ఓటములను ఎదుర్కొంటుందో... విమర్శలు రావడం మొదలవుతుంది. తాను కోచ్‌గా ఉన్న జట్టుపై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు అతడికే వదిలేయడం మంచిది" అని స్టీవ్ వా అన్నాడు. ప్రస్తుతం ఆసీస్ పేలవ ప్రదర్శనపై కూడా స్టీవ్ వా స్పందించాడు.

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం కష్టం

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం కష్టం

"ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం కష్టం. ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్‌ను కలిగిన జట్టు... వికెట్లను కూడా తీయగలరు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్‌లో 350కు పైగా పరుగులు చేయగలరు. ఈ స్కోరుని మించి పరుగులు చేయడం చాలా కష్టం. ఇప్పటికీ నేను నమ్మకంగా ఉన్నా టీమిండియాపై ఆసీస్ విజయం సాధిస్తుందని" స్టీవ్ వా అన్నాడు.

 నవంబర్ 21 నుంచి మూడు టీ20ల సిరిస్

నవంబర్ 21 నుంచి మూడు టీ20ల సిరిస్

నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌తో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్‌ జట్టును చిత్తుచేసిన టీమిండియా ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతోంది.

ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని కోహ్లీ

ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని కోహ్లీ

ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఇదే ఊపును ఆస్ట్రేలియా గడ్డపై కొనసాగించి జట్టును విజయపథంలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Story first published: Thursday, November 15, 2018, 14:18 [IST]
Other articles published on Nov 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X