న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ విజయంలో కీలకపాత్ర: ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా మళ్లీ స్టీవ్ స్మిత్!!

Steve Smith Will Lead Australia When Tim Paine Is Finished As Test Captain: Mark Taylor

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ తిరిగి కెప్టెన్‌గా ఎంపికవుతాడని ఆ దేశ మాజీ కెప్టెన్, సీఏ డైరెక్టర్‌ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డాడు. నిషేధం అనంతరం నేరుగా యాషెస్ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్నాడు. ముఖ్యంగా ఈ సిరిస్‌లో ఇప్పటికే 134.2 యావరేజితో ఏకంగా 671 పరుగులు చేశాడు.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 82 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మార్క్ టేలర్‌ మాత్రం స్మిత్‌ మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ కాగలడని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లకు నిషేధం విధించినప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులో టేలర్‌ సభ్యుడిగా ఉన్నాడు.

శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి!: పాక్‌‌లో పర్యటించడం అనుమానమేశ్రీలంక జట్టుపై ఉగ్రదాడి!: పాక్‌‌లో పర్యటించడం అనుమానమే

ఆసీస్‌కు తిరిగి స్మిత్‌ కెప్టెన్‌ అవుతాడు

ఆసీస్‌కు తిరిగి స్మిత్‌ కెప్టెన్‌ అవుతాడు

తాజాగా సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ పత్రికకు రాసిన కాలమ్‌లో మార్క్ టేలర్ "ఆసీస్‌కు తిరిగి స్మిత్‌ కెప్టెన్‌ అవుతాడనే నేను బలంగా నమ్ముతున్నా. అతనొక అత్యుత్తమ నాయకుడు" అని పేర్కొన్నాడు. "కేప్ టౌన్ సంఘటనపై స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించిన సమయంలో నేను క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఉన్నాను. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నుంచి అతడు కఠినమైన పాఠాలు నేర్చుకున్నందున మరోసారి మంచి నాయకుడిగా ఉంటాడనడంలో సందేహం లేదు" అని తెలిపాడు.

కెప్టెన్ రేసులో స్మిత్‌ ముందు వరుసలో

కెప్టెన్ రేసులో స్మిత్‌ ముందు వరుసలో

ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న టిమ్ పైన్‌పై కూడా మార్క్ టేలర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో టిమ్ పైన్ జట్టుని నడిపించిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఎప్పుడైతే ప్రస్తుత టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైనీకి ఆసీస్‌ ముగింపు పలుకుతుందో అప్పుడు కెప్టెన్ రేసులో స్మిత్‌ ముందు వరుసలో ఉంటాడని అన్నాడు.

రీఎంట్రీలోనే స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకపోవడం

రీఎంట్రీలోనే స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకపోవడం

"రీఎంట్రీలోనే స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకపోవడం నాకు పెద్ద సమస్యలా అనిపించలేదు. అది త్వరగా జరగాల్సిన అవసరం కూడా లేదు. అయితే, టిమ్ పైన్ టెస్ట్ కెప్టెన్‌గా ఎదిగినప్పుడు నేను ఆలోచించాలనుకుంటున్నాను. పైనీని ఎంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తారనేది కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. అది ఆరు నెలల సమయం లేదా రెండు లేదా మూడు సంవత్సరాలలో అయినా - అతని తర్వాత ఆసీస్‌ను నడిపించాలంటే స్మిత్‌ ఒక్కడే సరైనవాడు" అని టేలర్‌ అభిప్రాయపడ్డాడు.

సూపర్ ఫామ్‌లో స్టీవ్ స్మిత్

సూపర్ ఫామ్‌లో స్టీవ్ స్మిత్

ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడు 134.20 యావరేజితో 671 పరుగులు సాధించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు గాయపడ్డాడు. దీంతో స్మిత్ రెండో ఇన్నింగ్స్‌కు దూరం కావడంతో పాటు మూడో టెస్టు మ్యాచ్‌కి దూరమయ్యాడు.

పైన్‌ ముంగిట గొప్ప అవకాశం

పైన్‌ ముంగిట గొప్ప అవకాశం

తిరిగి నాలుగో టెస్టులో తుది జట్టులో స్థానం దక్కించుకున్న స్టీవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ 2-1 ఆధిక్యం సాధించిందంటే అందులో ప్రధాన పాత్ర స్మిత్‌దే. మరోవైపు 18 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లాండ్‌ జట్టు యాషెస్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. చివరగా 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత గ్రెగ్‌ చాపెల్‌, రీకీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌ల సారథ్యంలోని రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినా.. యాషెస్ ట్రోఫీని గెలవలేకపోయారు. అలాంటిది అనుకోకుండా కెప్టెన్‌ అయిన పైన్‌ ముంగిట ఉంది.

Story first published: Thursday, September 12, 2019, 12:51 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X