న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడాది నిషేధం విధించిన మారలేదు: కళ్లజోడు పెట్టుకుని లీచ్‌ను ఎగతాళి చేసిన స్మిత్

Ashes 2019 : Steve Smith Slammed For Mocking Jack Leach With Glasses
Steve Smith reportedly mocks Jack Leach by wearing glasses, Twitter reacts

హైదారాబాద్: ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలవడంతో పాటు యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.

యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో స్టీవ్ స్మిత్ కీలకపాత్ర పోషించడంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం అతడిని మోసగాడిగానే చూస్తున్నారు. నాలుగో టెస్టు విజయానంతరం యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకున్న ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాస్త అతి చేశారు.

మైదానంలో పుష్ అప్స్ తీయడంతో

మైదానంలో పుష్ అప్స్ తీయడంతో పాటు పాటలు పాడుతూ డ్యాన్స్‌లు కూడా చేశారు. గెలుపు సంబరాల సందర్భంగా ఇంగ్లిష్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ను అనుకరిస్తూ స్మిత్‌ ఎగతాళి చేయడంపై ఇంగ్లండ్‌ అభిమానులు మండిపడుతున్నారు. మూడో టెస్ట్‌లో బెన్‌స్టోక్స్‌కు లీచ్‌ అండగా నిలవడంతో ఇంగ్లాండ్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మ్యాజిక్ రిపీట్ అవలేదు

బెన్ స్టోక్స్‌తో కలిసి లీచ్ ఆఖరి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, ఆ మ్యాజిక్‌ని ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో జాక్ లీచ్ చేయలేకపోయాడు. దీంతో నాలుగో టెస్టులో విజయం సాధించిన తర్వాత లీచ్‌ తరహాలో స్టీవ్ స్మిత్ కళ్లజోడు పెట్టుకోగా జట్టులోని మిగతా ఆసీస్ ఆటగాళ్లు అతడు ఔట్‌ అన్నట్టు సైగలు చేసి చూపించారు.

మండిపడుతోన్న ఇంగ్లాండ్ అభిమానులు

దీనిపై ఇంగ్లాండ్ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో మోసగాడు ఇలా వ్యవహరించడం పెద్దగా ఆశ్చర్యపరిచే విషయం కాదని ఓ నెటిజన్ ట్వీట్‌ చేయగా... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎప్పటికీ మారదని... ఎప్పటిలాగే చెత్త స్పోర్ట్స్‌మన్‌షిప్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Story first published: Tuesday, September 10, 2019, 15:17 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X