న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు: అప్పర్ కట్ ఆడేది అలాగేనా? (వీడియో)

Steve Smith hates getting out: Australia star distraught after bizarre dismissal in Shield game


హైదరాబాద్:
షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ఆడుతోన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 290 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో స్మిత్‌కు ఇది 42వ సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే ఫస్ట్ క్లాస్ కెరీర్‌లోనే అత్యంత నెమ్మదిగా సెంచరీ ఇదే కావడం విశేషం.

దీనికి ముందు 2017/18 యాషెస్ సిరిస్‌లో గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 261 బంతుల్లో సెంచరీ సాధించాడు. డానియేల్ సోల్వేతో కలిసి రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన స్టీవ్ స్మిత్... మొయిస్ హెన్రీక్యూస్‌తో కలిసి మూడో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్న నెలకొల్పాడు.

గర్వంగా ఉంది: దీపక్ చాహర్ అత్యుత్తమ ప్రదర్శనపై సోదరి భావోద్వేగం! (వీడియో)గర్వంగా ఉంది: దీపక్ చాహర్ అత్యుత్తమ ప్రదర్శనపై సోదరి భావోద్వేగం! (వీడియో)

అనూహ్య రీతిలో స్టీవ్ స్మిత్ ఔట్

అనూహ్య రీతిలో స్టీవ్ స్మిత్ ఔట్

అయితే, ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ఔట్ మాత్రం అనూహ్యంగా జరిగింది. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో అప్పక్ కట్ ఆడే ప్రయత్నంలో స్టీవ్ స్మిత్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే, తొలుత తన ఔట్ విషయంలో అయోమయం నెలకొన్నప్పటికీ... అంఫైర్ ఔట్ ఇవ్వడంతో స్టీవ్ స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో స్టీవ్ స్మిత్(103) సెంచరీ అనంతరం నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ సెంచరీతో న్యూ సౌత్ వేల్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 314/4 పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ ఏడాది స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

అద్భుతమైన ఫామ్‌లో స్మిత్

అద్భుతమైన ఫామ్‌లో స్మిత్

యాషెస్ సిరిస్‌లో భాగంగా నాలుగు టెస్టులాడిన స్టీవ్ స్మిత్ 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2019లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య నవంబర్ 21న గబ్బా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

పాక్‌పై రెండు సెంచరీలు చేసిన స్మిత్

పాక్‌పై రెండు సెంచరీలు చేసిన స్మిత్

కాగా, పాకిస్థాన్‌పై స్టీవ్ స్మిత్ అద్భుతమైన టెస్టు గణాంకాలను కలిగి ఉన్నాడు. పాక్‌పై మొత్తం ఏడు టెస్టులు ఆడిన స్టీవ్ స్మిత్ రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. 2017లో మెల్ బోర్న్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్(165 నాటౌట్) ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తే.

Story first published: Tuesday, November 12, 2019, 16:10 [IST]
Other articles published on Nov 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X