న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌తో వన్డే సిరిస్: నిషేధం ముగిసినా స్మిత్, వార్నర్‌కు దక్కని చోటు!

Smith,Warner Not Selected For Pak ODI Series | Oneindia Telugu
Steve Smith, David Warner not picked in Australia squad for Pakistan ODIs

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మార్చి 28తో ముగియనుంది. వీరి నిషేధం ముగిసిన తర్వాత పాకిస్థాన్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌తో ఈ ఇద్దరూ పునరాగమనం చేస్తారని అందరూ భావించారు.

మంచి విందుతో వదిన మా ఫిట్‌నెస్‌ను పాడు చేస్తోంది: పంత్మంచి విందుతో వదిన మా ఫిట్‌నెస్‌ను పాడు చేస్తోంది: పంత్

పాక్‌తో ఐదు వన్డేల సిరిస్‌

పాక్‌తో ఐదు వన్డేల సిరిస్‌

పాక్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో చివరి రెండు వన్డేలు(మార్చి 29, 31) ఆడేందుకు వీరి అర్హులు. అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఈ వీరికి చోటు కల్పించలేదు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు ప్రస్తుతం భారత్‌తో ఆడుతున్న ఆసీస్‌ జట్టునే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడం విశేషం.

మిచెల్‌ స్టార్క్‌కు చోటు దక్కలేదు

మిచెల్‌ స్టార్క్‌కు చోటు దక్కలేదు

స్టార్‌ పేసర్ మిచెల్‌ స్టార్క్‌కు ఈ సిరిస్‌లో చోటు దక్కలేదు. అయితే స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు గాయాల నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టారని, వారి పునరాగమనానికి ఇండియన్‌ ప్రీమియల్‌ లీగ్‌(ఐపీఎల్‌) సరైనదిగా భావిస్తున్నారని ఆ జట్టు సెలక్షన్‌ ఛైర్మెన్‌ ట్రెవెర్‌ హాన్స్‌ తెలిపారు. ఐపీఎల్‌ను ప్రపంచ దిగ్గజాలు పాల్గొనే ఓ అత్యుత్తమైన టోర్నీగా అభివర్ణించారు.

డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున

డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతుండగా... స్టీవ్ స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. వరల్డ్‌కప్, యాషెస్‌ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ఆటను పరిశీలిస్తామన్నామని ట్రెవెర్‌ హాన్స్‌ తెలిపాడు. వరల్డ్‌కప్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టుని ఏప్రిల్ 23న ప్రకటించనున్నట్లు ఆయన తెలిపాడు. ఐదు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే మార్చి 22న షార్జా వేదికగా జరగనుంది.

2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా

2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా

కాగా, ప్రస్తుతం ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోందని ట్రెవెర్‌ హాన్స్‌ కొనియాడాడు. రెండు వన్డేల సిరిస్‌ను కైవసం చేసుకొని మంచి శుభారంభం ఇచ్చారని, రెండు వన్డేల్లోనూ గట్టిపోటీనిచ్చారని కొనియాడాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించడంతో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Friday, March 8, 2019, 12:25 [IST]
Other articles published on Mar 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X