న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరి రాకతో ఆస్టేలియా వరల్డ్‌కప్ నెగ్గుతుంది: షేన్ వార్న్

Steve Smith, David Warner Can Win World Cup For Australia, Says Shane Warne | Oneindia Telugu
Steve Smith, David Warner can win World Cup for Australia, says Shane Warne

హైదరాబాద్: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన ఏడాది పాటు నిషేధం ఈ ఏడాది మార్చితో ముగియనున్న సంగతి తెలిసిందే. నిషేధం అనంతరం వీరిద్దరూ ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో తిరిగి చేరడం దాదాపు ఖాయం అయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తామే మళ్లీ హాట్‌ ఫేవరెట్స్‌మని ఆ దేశ మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ అన్నాడు.

<strong>అభిమానిని ధోని పరిగెత్తించడంపై కామెంట్రీ బాక్సులో గవాస్కర్ సరదా వ్యాఖ్యలు</strong>అభిమానిని ధోని పరిగెత్తించడంపై కామెంట్రీ బాక్సులో గవాస్కర్ సరదా వ్యాఖ్యలు

డిఫెండింగ్‌ చాంపియన్‌గా వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతోన్న ఆస్ట్రేలియా జట్టు తిరిగి దానిని నిలబెట్టుకుంటుందని షేన్ వార్న్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం వార్న్‌ ఫాక్స్‌ స్పోర్ట్స్‌ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "జీవితంలో కొన్ని సార్లు చతికిలపడతాం. నేను కూడా గతంలో 12 నెలలు నిషేధాన్ని ఎదుర్కొన్నాను. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాను" అని అన్నాడు.

వార్నర్, స్మిత్‌ల పునరాగమనంతో

వార్నర్, స్మిత్‌ల పునరాగమనంతో

"నిషేధం తర్వాత మళ్లీ బరిలోకి దిగినప్పుడు ఆట యొక్క ప్రాధాన్యత వారికి బోధపడుతుంది. వార్నర్, స్మిత్‌ల పునరాగమనంతో మా జట్టు మరింత బలోపేతం అవడం ఖాయం. వరల్డ్‌కప్‌కు వెళ్లే మా జట్టులో వారిద్దరూ కీలక ఆటగాళ్లు. వారి రాకతో ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటానికి వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు" అని వార్న్ తెలిపాడు.

ఏడాది పాటు నిషేధం

ఏడాది పాటు నిషేధం

గతేడాది మొదట్లో సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడంతో వీరిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీరిపై ఉన్న నిషేధం ఈ నెలాఖరులో పూర్తవుతుంది. వారిద్దరూ ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి రానున్నారు. ఇటీవలే స్మిత్‌, వార్నర్‌లు మోచేయి శస్త్ర చికిత్సలు చేయించుకుని మంచి ఫిట్‌నెస్‌ సాధించారు. ఏడాది కాలం విశ్రాంతితో స్మిత్‌, వార్నర్‌ పునురుత్తేజం పొందారని షేన్‌వార్న్‌ తెలిపాడు.

గతంలో నాకు ఇలాంటే అనుభవమే

గతంలో నాకు ఇలాంటే అనుభవమే

గతంలో తనకు ఇలాంటే అనుభవమే ఎదురైందని షేన్ వార్న్‌ ఉదహరించాడు. 2003లో తాను డోప్‌ టెస్టులో పాజిటివ్‌గా రావడంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా వార్న్‌ ప్రస్తావించాడు. "ఆ సమయంలో డోపీగా తేలడంతో నాపై 12 నెలల నిషేధం విధించారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో నా మార్క్‌ స్పిన్‌తో సత్తా చాటా. ఈ నిషేధాన్ని నాలాగే ఉపయోగించుకోవచ్చు" అని వార్న్ అన్నాడు.

తొలుత కొన్ని మ్యాచుల్లో ఆందోళన

తొలుత కొన్ని మ్యాచుల్లో ఆందోళన

"మరింత తాజాదనంతో వారు ఫీల్డ్‌లోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ క్రమంలోనే వారు రెచ్చిపోయి ఆడతారు. వారికి క్రికెట్‌ ఎంత ముఖ్యమో తెలుసు. ఇప్పుడు వారిద్దరికీ నిరూపించుకొనే అవకాశం వచ్చింది. తొలుత కొన్ని మ్యాచుల్లో ఆందోళన ఉంటుంది. ఇది వారికి మంచి చేస్తుంది. ఆ తర్వాత వారు అద్భుతంగా ఆడతారు' అని షేన్‌ వార్న్‌ అన్నాడు. వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా ఆసీస్ జట్టుకు కోచ్‌గా నియమితులైన పాంటింగ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. వరల్డ్‌కప్‌కు ముందు వీరిద్దరూ ఐపీఎల్‌‌లో తమ ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోనున్నారు.

Story first published: Thursday, March 7, 2019, 12:12 [IST]
Other articles published on Mar 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X