న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి సాధ్యం కాని రికార్డు: లెజెండ్స్ క్లబ్‌లోకి స్టీవ్ స్మిత్

సిడ్నీ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు 50వ టెస్టు. తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: సిడ్నీ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు 50వ టెస్టు. తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 50 టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ మొదటి స్ధానంలో ఉన్నాడు. 68 ఏళ్ల క్రితం డాన్ బ్రాడ్‌మన్ అందుకున్న 60/50 మైలురాయిని ఇప్పుడు స్టీవ్ స్మిత్ అందుకోవడం గమనార్హం.

91 ఇన్నింగ్స్‌లాడిన స్టీవ్ స్మిత్ 60.63 యావరేజితో 4693 పరుగులు నమోదు చేశాడు. ఇక 50 టెస్టుల్లో 6790 పరుగులు సాధించి డాన్ బ్రాడ్‌మన్ 99.85 యావరేజితో మొదటి స్ధానంలో ఉండగా, 4947 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ 57.52 యావరేజితో రెండో స్ధానంలో ఉన్నాడు.

యావరేజి పరంగా చూస్తే డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్ధానం స్టీవ్ స్మిత్‌దే కావడం విశేషం. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్మిత్ 165 పరుగులు చేయడంతో 50 టెస్టుల్లో 60.63 యావరేజిని సాధించాడు.

60కిపైగా యావరేజి

60కిపైగా యావరేజి

టెస్టు క్రికెట్ చరిత్రలో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న క్రమంలో 60కిపైగా యావరేజిని కలిగి ఉన్న క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మన్‌తో పాటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ద్వయం హెర్బర్ట్ సుత్క్లిఫ్ఫే, జాక్ హాబ్స్‌లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. 1934లో తన 50వ టెస్టు మ్యాచ్ ఆడిన హెర్బర్ట్ సుత్క్లిఫ్ఫే 61.67 యావరేజితో 4,255 పరుగులు నమోదు చేశాడు.

మూడో అత్యధిక యావరేజి

మూడో అత్యధిక యావరేజి

ఇక 1928లో 50వ టెస్టు మ్యాచ్ ఆడిన జాక్ హాబ్స్‌ 61.28 యావరేజితో 4,596 పరుగులు నమోదు చేశాడు. ఇక టెస్టుల్లో 3000కు పైగా పరుగులు సాధించే క్రమంలో స్టీవ్ స్మిత్ మూడో అత్యధిక యావరేజిని నమోదు చేశాడు. 99.94 యావరేజితో డాన్ బ్రాడ్‌మన్ మొదటి స్ధానంలో ఉండగా, 60.73 యావరేజితో హెర్బర్ట్ సుత్క్లిఫ్ఫే రెండో స్ధానంలో ఉండగా, 60.63 యావరేజితో స్మిత్ మూడో స్ధానంలో ఉన్నాడు.

కోహ్లి, జో రూట్‌‌కు సాధ్యం కాని రికార్డు

కోహ్లి, జో రూట్‌‌కు సాధ్యం కాని రికార్డు

ఇదిలా ఉంటే సమకాలీన క్రికెట్లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లి, జో రూట్‌, కేన్ విలియమ్సన్‌లకు సాధ్యం కాని ఈ అరుదైన ఘనతను స్టీవ్ స్మిత్ ఒక్కడే సాధించాడు. కోహ్లీ 53 టెస్టుల్లో 90 ఇన్నింగ్స్‌లాడి 4209 పరుగులు చేయగా, జో రూట్ 53 టెస్టుల్లో 98 ఇన్నింగ్స్‌లాడి 4594 పరుగులు చేశాడు.

91 ఇన్నింగ్స్‌ ఆడి 4693 పరుగులు

91 ఇన్నింగ్స్‌ ఆడి 4693 పరుగులు

అయితే స్టీవ్ స్మిత్ తన కెరీర్లో 91 ఇన్నింగ్స్‌‌లాడి 4693 పరుగులు చేసి వీరిద్దరి కంటే ముందు వరుసలో నిలిచాడు. టెస్టు సెంచరీల్లో కూడా స్టీవ్ స్మిత్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందే ఉన్నాడు. ఇప్పటి వరకు స్మిత్ 17 సెంచరీలు సాధించగా, కోహ్లీ ఖాతాలో 15 సెంచరీలు ఉన్నాయి.

స్టీవ్ స్మిత్ టెస్టు పరుగులు:

స్టీవ్ స్మిత్ టెస్టు పరుగులు:

2014: 1146 runs at 81.85

2015: 1474 runs at 73.70

2016: 1079 runs at 71. 93

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X