న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ మరో 20 పరుగులు చేస్తే.. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు!!

Steve Smith 20 runs away from surpassing Don Bradmans mark in elite Test list

అడిలైడ్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ నిషేధం అనంతరం పరుగుల సునామీ సృష్టిస్తూ అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. దిగ్గజాలు నెలకొల్పిన రికార్డులను బ్రేక్‌ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ లెజండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్‌ రికార్డుపై స్మిత్‌ కన్నేశాడు.

క్రికెట్‌లో అరుదైన షాట్.. బ్యాట్‌ను వెనక్కితిప్పి కొడితే సిక్సర్‌ (వీడియో)!!క్రికెట్‌లో అరుదైన షాట్.. బ్యాట్‌ను వెనక్కితిప్పి కొడితే సిక్సర్‌ (వీడియో)!!

బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన స్మిత్‌:

బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన స్మిత్‌:

ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్‌మన్‌ను అధిగమించడానికి స్మిత్‌ కేవలం 20 పరుగుల దూరంలో ఉన్నాడు. బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 6,996 పరుగులు చేయగా.. స్మిత్‌ 69 టెస్టుల్లో 6,977 పరుగులు చేసాడు. ఈ రోజు అడిలైడ్‌ వేదికగా పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ మరో 19 పరుగులు చేస్తే బ్రాడ్‌మన్‌తో సమానంగా నిలుస్తాడు. ఇక 20 పరుగులు చేస్తే.. బ్రాడ్‌మన్‌ను అధిగమిస్తాడు.

 మూడు సెంచరీల దూరంలో:

మూడు సెంచరీల దూరంలో:

టెస్ట్ ఫార్మాట్‌లో బ్రాడ్‌మన్ 29 సెంచరీలు చేసాడు. స్మిత్‌ 26 సెంచరీలు చేసాడు. బ్రాడ్‌మన్ సెంచరీలను అందుకోవడానికి స్మిత్‌ మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ఆసీస్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ (13,378) అగ్రస్థానంలో ఉన్నాడు. పాంటింగ్‌ టెస్ట్ ఫార్మాట్‌లో 29 సెంచరీలు చేసాడు.

3 కిలోమీటర్లు పరుగెత్తిన స్మిత్:

3 కిలోమీటర్లు పరుగెత్తిన స్మిత్:

పాక్‌తో బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ 4 పరుగులు మాత్రమే చేసి.. స్పిన్నర్ యాసిర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తక్కువ పరుగులకే ఔట్ అవవడంతో తనకు తానుగా శిక్ష వేసుకున్నాడు. తొలి టెస్టు ముగిసిన తర్వాత బస్సులో సహచర ఆటగాళ్లతో కలిసి అతడు హోటల్‌కు వెళ్లలేదు. గబ్బా నుంచి హోటల్ వరకు 3 కిలోమీటర్లకు పైగా పరుగెత్తాడు.

నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు:

నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు:

బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. యాషెష్ 2019తో మళ్లీ పునరాగమనం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో అర్ధ సెంచరీ, నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీ, ఐదవ టెస్టులో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. యాషెస్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

Story first published: Friday, November 29, 2019, 15:13 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X