న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అలీ భ‌య్యా స్టే స్ట్రాంగ్‌.. మ‌నం తిరిగి పుంజుకుంటాం'

Stay strong brother: Sarfaraz Ahmed backs under fire captain Azhar Ali

మాంచెస్టర్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్ర‌ఫోర్డ్‌‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యం‌ను ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విజయంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్ ‌(75), పేసర్ క్రిస్ వోక్స్ ‌(84)లు కీలక పాత్ర పోషించారు. గెలిచే టెస్టు పాక్ ఓటమి చెందడం పట్ల మాజీ ఆటగాళ్లు, అభిమానులు‌ విమర్శలు గుప్పించారు.

గ‌త రెండు ద‌శాబ్దాల్లో పాకిస్థాన్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 250 ప‌రుగుల‌పై ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం ఇదే తొలిసారి. దీంతో పాక్ కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐదు వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో స్ట్ర‌యిక్ బౌల‌ర్ల‌ను కొన‌సాగిస్తూ ఇంగ్లండ్‌పై మ‌రింత ఒత్తిడి పెంచాల్సింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పాక్ మాజీ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌.. ప్రస్తుత సారథి అజ‌హ‌ర్ అలీకి అండ‌గా నిలిచాడు. 'భ‌య్యా స్టే స్ట్రాంగ్‌. ఇన్షాల్లాహ్ మ‌నం తిరిగి పుంజుకుంటాం. పాకిస్తాన్ జిందాబాద్' అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. క్లిష్ట ప‌రిస్థితుల్లో అలీకి స‌ర్ఫ‌రాజ్ నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం కొస‌మెరుపు.

మరోవైపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కంటే పాకిస్తాన్‌ అన్ని విధాలా బాగా ఆడినా అవసరమైన సందర్భంలో రాణించలేకపోవడం వల్లే విజయం సాధింలేకపోయిందని పాక్ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్ పేర్కొన్నాడు. అలీ కొన్ని ప్రయోగాలు చేయకపోవడం వల్లే గెలవాల్సిన మ్యాచ్‌ను పరాజయంతో ముగించాల్సి వచ్చిందన్నాడు. తన యూట్యూబ్‌ చానల్‌లో ఇంజమాముల్ ‌మాట్లాడుతూ... 'నా ప్రకారం చూస్తే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌట్‌ అవుతుందని అనుకున్నా. కానీ మా కెప్టెన్‌ అజహర్‌ అలీ చేసిన తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఇచ్చాం. కనీసం షార్ట్‌ బాల్స్‌ను కూడా ఎక్కడా ప్రయోగించలేదు' అని అన్నాడు.

'ఇంగ్లండ్‌ విజయానికి కారకులైన బట్లర్‌, వోక్స్‌లు షార్ట్‌ పిచ్‌ బంతుల్ని ఆడలేరు. ఈ ప్రయోగం చేయలేదు. అజహర్‌ అలీ కెప్టెన్‌గా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇంగ్లండ్‌ కంటే పాకిస్తాన్‌ బలంగా ఉంది. ఫ‌లితంతో నిరాశ చెందా. కానీ ఇప్ప‌టికీ పాక్ జ‌ట్టే సిరీస్ నెగ్గుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ ప‌రుగులు చేయ‌లేక‌పోవ‌డంతో పాక్ ఆట‌గాళ్లు కాస్త ఆందోళ‌న‌లో క‌నిపించారు. అదే ఫ‌లితంపై ప్ర‌భావం చూపింది. ఇలాంటి స‌మ‌యంలో జ‌ట్టు స‌హాయ సిబ్బంది ఆట‌గాళ్లలో ఆత్మ‌విశ్వాసం నింపాలి' అని ఇంజీ సూచించారు.

ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌‌గా అనంతపద్మనాభన్.. నాలుగో భారతీయుడిగా గుర్తింపు!!ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌‌గా అనంతపద్మనాభన్.. నాలుగో భారతీయుడిగా గుర్తింపు!!

Story first published: Tuesday, August 11, 2020, 16:54 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X