న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ నుంచి ఇద్దరు: ప్రపంచ క్రికెట్‌లో పుట్టినరోజున సెంచరీలు సాధించిన క్రికెటర్లు వీరే!

14 Batsman Who Did Centuries & Double Centuries On Their Birthday || Oneindia Telugu
Stats: Players to complete centuries and double centuries on their birthday in International cricket

హైదరాబాద్: శ్రీలంకతో అడిలైడ్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతికి సెంచరీకి సాధించడంతో వార్నర్ ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.

ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో డేవిడ్ వార్నర్‌కి ఇది తొలి సెంచరీ. టీ20ల్లో సెంచరీ సాధించేందుకు వార్నర్‌ 71 ఇన్నింగ్స్‌లు తీసుకోవడం విశేషం. బాల్ టాంపరింగ్‌తో ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్ 20 నెలలు తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో సెంచరీ సాధించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

మరోసారి వార్తల్లో నిలిచిన మంజ్రేకర్: జోకులు పేల్చుతున్న నెటిజన్లుమరోసారి వార్తల్లో నిలిచిన మంజ్రేకర్: జోకులు పేల్చుతున్న నెటిజన్లు

33వ పుట్టినరోజు నాడు వార్నర్ సెంచరీ

33వ పుట్టినరోజు నాడు వార్నర్ సెంచరీ

అయితే, ఇక్కడ మరొక విశేషం ఉంది. అదే రోజు డేవిడ్ వార్నర్ తన 33వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. దీంతో పుట్టినరోజు నాడు టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. అంతకముందు వరకు టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రమే టీ20ల్లో పుట్టినరోజు నాడు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

60 పరుగులతో యువరాజ్ సింగ్

60 పరుగులతో యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ తన 28వ పుట్టినరోజు నాడు 2009లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పుట్టినరోజున సెంచరీ పూర్తి చేసిన 14వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు [పురుషుల క్రికెట్‌లో].

జాబితాలో మొత్తం 14 మంది

జాబితాలో మొత్తం 14 మంది

డేవిడ్ వార్నర్‌కు ముందు టెస్టుల్లో 9 మంది, వన్డేల్లో నలుగులు ఆటగాళ్లు పుట్టినరోజున సెంచరీలు నమోదు చేశారు. ఈ 14మంది ఆటగాళ్లలో టెస్టుల్లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీని డబుల్ సెంచరీగా మలిచారు. 1930లో ప్యాస్టీ హెడ్రెన్ తన 41వ పుట్టినరోజున వెస్టిండిస్‌పై జరిగిన మ్యాచ్‌లో 205 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు.

201 పరుగులతో జాసన్ గిలెస్పీ డబుల్ సెంచరీ

201 పరుగులతో జాసన్ గిలెస్పీ డబుల్ సెంచరీ

2006లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ జాసన్ గిలెస్పీ 201 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఆరోజుని మరచిపోలేని రోజుగా అభివర్ణించాడు. శ్రీలంకకు చెందిన కుశాల్ మెండిస్ 2018లో చొట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో 196 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆస్ట్రేలియాపై పుట్టినరోజున సచిన్ సెంచరీ

ఆస్ట్రేలియాపై పుట్టినరోజున సచిన్ సెంచరీ

ఫలితంగా నాలుగు పరుగుల దూరంలో డబుల్ సెంచరీని మిస్సయ్యాడు. తన 23వ పుట్టినరోజు నాడు 113 పరుగులు చేశాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన 25వ పుట్టినరోజు నాడు 134 పరుగులతో సెంచరీ సాధించాడు. 1998లో షార్జా ముక్కోణపు సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై సచిన్ ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లాండ్‌పై 1993లో వినోద్ కాంబ్లీ సెంచరీ

ఇంగ్లాండ్‌పై 1993లో వినోద్ కాంబ్లీ సెంచరీ

భారత్ నుంచి తన పుట్టినరోజున సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ గుర్తింపు పొందాడు. అంతకముందు తన చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ వన్డేల్లో పుట్టినరోజున సెంచరీ సాధించాడు. 1993లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వినోద్ కాంబ్లీ తన 21వ పుట్టినరోజున సెంచరీ సాధించాడు.

Stats: Players to complete centuries and double centuries on their birthday in International cricket
Story first published: Tuesday, October 29, 2019, 17:22 [IST]
Other articles published on Oct 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X