న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రిస్బేన్‌లో హాఫ్ సెంచరీ: టీ20ల్లో శిఖర్ ధావన్ ఆల్‌టైమ్ రికార్డు

ndia vs Australia 2018 1st T20I: shikhar Dhawan Scores 50 Runs In 42 Balls | Oneindia Telugu
Stats: Most runs in a calendar year in T20Is

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్(76: 42 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టీ20ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని అధిగమించాడు.

అంతేకాదు టీ20ల్లో ఒక కేలండర్ ఇయర్‌లో శిఖర్ ధావన్ ఆల్‌టైమ్ రికార్డుని నెలకొల్పాడు. ఈ ఏడాది శిఖర్ ధావన్ మొత్తం 16 మ్యాచ్‌లాడి 648 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(641) పరుగుల రికార్డుని బద్దలు కొట్టాడు.

 ఈ ఏడాది టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో

ఈ ఏడాది టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో

32 ఏళ్ల ధావన్ ఈ ఏడాది టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో గత కేలండర్ ఇయర్‌లో ధావన్(301) చేసిన పరుగుల రికార్డుని డబుల్ చేయడం విశేషం. 2016లో ధావన్ ఈ పరుగులు నమోదు చేశాడు. అయితే, ఈ ఏడాది ధావన్ ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు.

కేవలం ఎనిమిది సార్లు మాత్రమే ఇలా

కేవలం ఎనిమిది సార్లు మాత్రమే ఇలా

ధావన్ యావరేజి 40.5 కాగా, స్ట్రైక్ రేట్ 145గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం ఎనిమిది సార్లు మాత్రమే బ్యాట్స్‌మెన్ ఒక కేలండర్ ఇయర్‌లో 500కుపైగా పరుగులు సాధించారు. ఈ ఏడాది టీ20ల్లో ఆరుగురికి పైగా బ్యాట్స్‌మన్ 500కుపైగా పరుగులు సాధించారు.

పాక్, భారత్ నుంచి ఇద్దరు

పాక్, భారత్ నుంచి ఇద్దరు

ఇందులో పాకిస్థాన్, భారత్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్ మెన్లు ఉండగా... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఒకొకరు ఉన్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్... పాక్ నుంచి బాబర్ అజామ్, ఫకార్ జమాన్.. ఆసీస్ నుంచి ఆరోన్ ఫించ్, కివీస్ నుంచి కొలిన్ మున్రోలు ఉన్నారు.

 టీ20ల్లో ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

టీ20ల్లో ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

1. శిఖర్ ధావన్ - 648 runs from 16 matches in 2018

2. విరాట్ కోహ్లీ - 641 runs from 15 matches in 2016

3. ఫకార్ జమాన్ - 576 runs from 17 matches in 2018

4. రోహిత్ శర్మ - 567 runs from 17 matches in 2018

5. బాబర్ అజాం - 563 runs from 12 matches in 2018

6. మహమ్మద్ షెహజాద్ - 520 runs from 15 matches in 2016

7. ఆరోన్ ఫించ్ - 503 runs from 15 matches in 2018

8. కొలిన్ మున్రో - 500 runs from 12 matches in 2018

9. రోహిత్ శర్మ - 497 runs from 18 matches in 2016

10. గ్లెన్ మ్యాక్స్‌వెల్- 474 runs from 17 matches in 2018

1
43620
Story first published: Wednesday, November 21, 2018, 18:31 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X