న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన పాక్ ఓపెనర్లు

By Nageshwara Rao
Stats: Kamran Akmal, Salman Butt break world record for highest T20 opening partnership

హైదరాబాద్: పాకిస్థాన్ ఓపెనర్లు సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్‌లు సరికొత్త రికార్డుని సృష్టించారు. టీ20 క్రికెట్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించారు. శుక్రవారం రావల్పిండిలో జరిగిన నేషనల్ టీ20 కప్‌ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు అయింది.

నేషనల్ టీ20 కప్‌లో భాగంగా శుక్రవారం ఇస్లామాబాద్ రీజియన్-లాహోర్ రీజియన్ వైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ వైట్స్‌ ఓపెనర్లు బట్, అక్మల్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

71 బంతులు ఎదుర్కొన్న అక్మల్ 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. సల్మాన్ భట్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 20 ఓవర్లు వీరిద్దరే ఆడారు. ఈ మ్యాచ్‌లో వైడ్ల రూపంలో నాలుగు పరుగులు లభించాయి.

దీంతో వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యంలో 209 పరుగులు నమోదు చేశారు. టీ20 క్రికెట్ చరిత్రలో భట్, అక్మల్ నెలకొల్పిన ఈ 209 పరుగుల భాగస్వామ్యమే ఇప్పటి వరకు అత్యధికం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ రీజియన్స్ అసిఫ్‌ అలీ, బిలాల్‌ అలీ బౌలింగ్‌‌కు 18.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం 171 పరుగుల రికార్డు న్యూజిలాండ్‌ ఓపెనర్లు మార్టిన్‌ గుప్టిల్‌, కేన్‌ విలియమ్సన్‌ల పేరిట ఉండేది. 2016లో హమిల్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్లు ఈ రికార్డుని సృష్టించారు.

టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన క్రికెటర్లు వీరే:

Stats: Kamran Akmal, Salman Butt break world record for highest T20 opening partnership
Story first published: Saturday, November 25, 2017, 10:59 [IST]
Other articles published on Nov 25, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X