నాటింగ్‌హామ్: టెస్టు కెరీర్‌లో 100వికెట్లను తీసుకున్న బౌలర్‌గా అండర్సన్ రికార్డు నమోదు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో గతేడాది లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ నుంచి అతను ఇదే ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో గత వారం జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 350 వికెట్లు తీసిన అండర్సన్ సొంత గడ్డపై 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్ కూడా. అంతే స్థాయిలో బౌలర్లకు బాగా కలిసొచ్చే మైదానం నాటింగ్‌హోమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో కూడా వికెట్లు తీయగలిగాడు.
ఇండియాతో తలపడిన మొదటి రోజు ఆటకు తన బౌలింగ్‌లో భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వికెట్‌ను తీశాడు. ఇలా పాండ్యా వికెట్‌తొ 100 వికెట్లను పూర్తి చేసుకున్న అండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే భారత ప్రత్యర్థిగా శ్రీలంక జట్టు బౌలర్ అయిన ముత్తయ్య మురళీదరన్ ఎప్పుడో దాటేశాడు కూడా. టెస్టు ఫార్మాట్లో అండర్సన్ రెండు మూడు సార్లు సచిన్ టెండూల్కర్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు టీమిండియా 2014లో ఇంగ్లాండ్ వెళ్లిన సందర్భం కూడా.
ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు మినహాయించి అండర్సన్ భారత బ్యాట్స్‌మెన్ పై విరుచుకుపడిన సందర్భాలు బోలెడున్నాయి. ఇండియాతో పాటు .. అండర్సన్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల జట్టులో 104 వికెట్లు పడొగొట్టాడు. రెండు దేశాల మీద 100కి మించిన వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కేవలం ఆస్ట్రేలియా మీదనే 100వికెట్లు తీసిన వాళ్లు ఏడుగురున్నారు.
ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 124/2తో నిలిచి మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (33), విరాట్ కోహ్లి (8) ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 168 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని ఇప్పుడు భారత్ 292 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.