న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

30 ఏళ్ల క్రితం కోట్లాలో: 3వ టెస్టు నెగ్గితే కోహ్లీసేన అరుదైన రికార్డులు

By Nageshwara Rao
Statistical preview, 3rd Test: India, Virat Kohli eye host of records

హైదరాబాద్: మరో టెస్టు సిరీస్‌‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం (డిసెంబర్ 2)న ప్రారంభం కానుంది.

ఢిల్లీలో 3వ టెస్టు: పరువు కోసం శ్రీలంక, ఓపెనింగ్‌పై డైలమాలో కోహ్లీఢిల్లీలో 3వ టెస్టు: పరువు కోసం శ్రీలంక, ఓపెనింగ్‌పై డైలమాలో కోహ్లీ

నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరిస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. దీంతో చివరి టెస్టులో విజయం సాధించి టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలనే కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది.

మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధిస్తే నమోదయ్యే రికార్డులివే:


వరుసగా 9 టెస్టు సిరిస్‌లు:
ఢిల్లీ టెస్టులో కోహ్లీసేన విజయం సాధిస్తే అరుదైన రికార్డుని సొంతం చేసుకుంటుంది. ఈ విజయంతో టీమిండియా వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్నట్టు అవుతోంది. ఇప్పటి వరకు టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీసేన సమం చేస్తుంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిగా... 1884-1892 మధ్య కాలంలో ఇంగ్లాండ్ కూడా వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్‌ల్లో విజయం సాధించింది.


కోట్లాలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన టెస్టుల సంఖ్య 33
మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు 33 టెస్టులు ఆడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక అత్యధికంగా 44 టెస్టులకు ఆతిథ్యమిచ్చింది.


30 ఏళ్ల క్రితం కోట్లాలో భారత్ ఓటమి
సరిగ్గా 30 ఏళ్ల క్రితం అంటే 1987లో భారత జట్టు కోట్లా స్టేడియంలో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో భారత జట్టుపై వెస్టిండిస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


5000 పరుగుల క్లబ్‌లో చేరేందుకు కోహ్లీకి కావాల్సిన పరుగులు 25
టెస్టుల్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే భారత్‌ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు. ఇప్పటి వరకు కోహ్లీ 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 4,975 పరుగులు సాధించాడు.


కోహ్లీ కెప్టెన్సీలో భారత్ నెగ్గిన టెస్టులు 21
కెప్టెన్‌గా ఇప్పటివరకు 21టెస్టు విజయాలను అందించిన కోహ్లీ... మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో సమంగా ఉన్నాడు. ఢిల్లీ టెస్టులో భారత్ విజయం సాధిస్తే గంగూలీ టెస్టు విజయాల రికార్డుని అధిగమిస్తాడు.


కోహ్లీ, పుజారా చేసిన సెంచరీల సంఖ్య 4
2017లో విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాలు చేసిన సెంచరీలు సంఖ్య 4. ఢిల్లీ టెస్టులో వీరిద్దరూ సెంచరీలు నమోదు చేస్తే ఒక ఏడాదిలో 5 సెంచరీలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ రికార్డుని సమం చేస్తారు.


ఈ ఏడాది అశ్విన్ ఇప్పటివరకు తీసుకున్న వికెట్ల సంఖ్య 52
ఈ ఏడాది ఇప్పటివరకు అశ్విన్ 52 వికెట్లు తీసుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడను అధిగమిస్తాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 1, 2017, 18:08 [IST]
Other articles published on Dec 1, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X