న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టాటిస్టికల్ హైలెట్స్: 4వ వన్డేలో నమోదైన గణాంకాలివే

Statistical highlights: India vs West Indies, 4th ODI at Mumbai

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్(54) ఒక్కడే ఫరవాలేదనిపించాడు.

ముంబై వన్డేలో భారత్ విజయం: ఐదు వన్డేల సిరిస్‌లో 2-1 ఆధిక్యంముంబై వన్డేలో భారత్ విజయం: ఐదు వన్డేల సిరిస్‌లో 2-1 ఆధిక్యం

టెస్ట్ హోదా జట్లపై వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కాగా, మొత్తంగా మూడోది కావడం విశేషం. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది.

పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌లు చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఓపెనర్ రోహిత్ శర్మ (162), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (100) సెంచరీలు సాధించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నమోదు చేసిన రికార్డులు మీకోసం....

 224

224

వన్డేల్లో పరుగుల తేడాతో టీమిండియా సాధించిన మూడో అతిపెద్ద విజయం ఇది. 2007లో వెస్టిండిస్ జరిగిన వరల్డ్ కప్‌లో భాగంగా బెర్ముడాపై 257 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా.. మళ్లీ 2008లో 256 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై భారత్ గెలిచింది. రెండువందలకు పైగా పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడం ఇది మూడోసారి. 2015లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ జట్టు 257 పరుగుల తేడాతో ఓడిపోగా.. తాజా ఓటమితో రెండోసారి 200కు పైగా పరుగుల తేడాతో విండీస్ ఓడింది.

211

211

ఈ మ్యాచ్‌లో మూడో వికెట్‌కు రోహిత్ శర్మ, తెలుగు తేజం అంబటి రాయుడు నెలకొల్పిన భాగస్వామ్యం. భారత్ తరఫున ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం కాగా.. ఈ సిరీస్‌లో రెండోసారి భారత్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం.

 7

7

వన్డేల్లో ఓపెనర్ రోహిత్ శర్మ 150+పైగా స్కోరు నమోదు చేయడం ఇది ఏడోసారి. అంతర్జాతీయ క్రికెట్‌‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 5 సార్లు ఈ ఘనత సాధించారు. తాజా సెంచరీతో రోహిత్ శర్మ తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, విరాట్‌ కోహ్లీ, సనత్ జయసూర్య 4 సార్లు 150కిపైగా పరుగుల సాధించి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

6

6

ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో 6 సెంచరీలు నమోదు చేయడం టీమిండియాకు ఇది మూడోసారి. ఈ సిరీస్‌లో కోహ్లీ 3, రోహిత్ 2 సెంచరీలు సాధించగా... అంబటి రాయుడు సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో 2013-14 సిరీస్‌లోనూ 2015-16లో జరిగిన సిరీస్‌లోనూ భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.

162

162

వన్డేల్లో 2018 ఏడాదికి గాను భారతీయ బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. బ్రబౌర్న్ స్టేడియంలో భారీ సెంచరీ నమోదు చేయడం ద్వారా రోహిత్ ఈ రికార్డును నెలకొల్పాడు. అంతేకాదు 2013 నుంచి ప్రతి ఏడాది భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేస్తోన్న భారత ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు.

Story first published: Tuesday, October 30, 2018, 12:35 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X