న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సినీ దేవి.. శ్రీ దేవీ ఇక లేరు.! విషాదంలో సచిన్‌తో సహా పలువురు క్రికెటర్లు

సినీ దేవి.. శ్రీ దేవీ ఇక లేరు.! విషాదంలో సచిన్‌తో సహా పలువురు క్రికెటర్లు
Sridevi dies at 54: Sportspersons offer condolences on Bollywood legend’s passing

హైదరాబాద్: సీనియర్‌ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం చెందడంతో పలువురు క్రికెటర్లు షాక్‌కు గురైయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె.. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని సంజయ్‌ కపూర్‌ ద్రువీకరించారు. ఈ విషయం తమను షాక్‌కు గురిచేసిందని పలువురు క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

టీమిండియా క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ షమీ, ఆకాశ్‌ చోప్రా, అశ్విన్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, రెజ్లింగ్‌ స్టార్స్‌ సింగ్‌ బ్రదర్స్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షబోగ్లేలు ట్విటర్‌ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


ఆమెను చూస్తూ పెరిగిన జనరేషన్ మాది. ఒక్కసారిగా ఆమె లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. వాళ్ల కుటుంబానికి నా ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను- సచిన్


విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురైయ్యా.. హృదయపూర్వకంగా నివాళులు- వీరేంద్ర సెహ్వాగ్


ఇది ఇంతటి బాధకరమైన షాకింగ్ వార్త ఇది. ఆమె కుటుంబానికి నా సంతాపం ప్రకటిస్తున్నాను- పీవి సింధు


ఐకానిక్‌ నటి శ్రీదేవి మరణ వార్త విని షాక్‌కు గురయ్యా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం- వీవీఎస్‌ లక్ష్మణ్‌


శ్రీదేవి ఇక లేరా? ఆమె లేదనే ఈ వార్తా చాలా కష్టంగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి- రవిచంద్రన్‌ అశ్విన్‌


శ్రీదేవి మరణం షాక్‌కు గురిచేసింది. ఆమె సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం- మహ్మద్‌ కైఫ్‌


భారత సినీ చరిత్రలో గొప్ప తారగా వెలిగిన శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి. మా చిన్నతనంలో ఆమె సినిమాలెన్నో చూశాం- సింగ్‌ బ్రదర్స్‌, రెజ్లింగ్‌ స్టార్స్‌


ఈ చేదువార్త నిజం కాకపోతే బాగుండు.. షాకయ్యా- ఆకాశ్‌ చోప్రా


శ్రీదేవి స్వశక్తితో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఓ తార.. ఆమె మరణించే వయస్సే కాదిది - ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాబోగ్లే


భారత సినీ పరిశ్రమకు మీరెంతో కృషి చేశారు. మీ అకాల మరణం తీరని నష్టం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి- ప్రజ్ఞాన్‌ ఓజా


నా అభిమాన నటి శ్రీదేవి మరణం షాక్‌కు గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి- పారుపల్లి కశ్యప్‌






Story first published: Monday, February 26, 2018, 17:16 [IST]
Other articles published on Feb 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X