జాతీయ గీతం ఆపి యాడ్‌లు వేసేశారు

Posted By:
Sri Lankan National Anthem Cut Off by Broadcaster to Show Commercials, Fans Lash Out

హైదరాబాద్: కాదేది యాడ్‌కు అనర్హం అన్నట్లు మారింది వాణిజ్య ప్రకటనల తంతు. యాడ్ వేయడానికి అదీ ఇదీ అని ఏమీ లేదు. సినిమా సరిగ్గా మంచి సీన్‌లో ఉన్న సమయంలో యాడ్‌లు వేసేస్తారు. అది సినిమా అయితే పరవాలేదు. కానీ, మితిమీరి చివరకు జాతీయ గీతానికి కూడా బ్రేక్ వేయడం పరిపాటైపోయింది ఈ వాణిజ్య ప్రకటనలకి. మంగళవారం జరిగిన టీ 20 క్రికెట్ మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. జాతీయ గీతం ఆలపిస్తుండగా దాన్ని చూపించడం మానేసి ప్రకటనలు వేసింది డీస్పోర్ట్స్‌ ఛానల్‌.

ముక్కోణపు సిరీస్‌కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార హక్కులను డీస్పోర్ట్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాస్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు జాతీయ గీతాలాపన కోసం మైదానంలోకి వచ్చారు. మరి కాసేపట్లో వీక్షకులు తగ్గిపోతారనుకుందో.. జాతీయగీతం ఆసక్తి తగ్గిపోయిందని భావించిందో.. యాడ్ ప్రసారం చేసేసేంది.

దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం ఇరు జట్లు జాతీయ గీతాలు ఆలపించాల్సి ఉంది. ముందుగా భారత్ జట్టు 'జనగణమన' ఆలపించింది. తర్వాత శ్రీ లంక జట్టు 'శ్రీలంక మాత' గీతం ఆలపిస్తూ ఉండగానే బ్రేక్ వేసిన ఛానెల్ వారు యాడ్ వేసేశారు.

అలాకాకుండా మధ్యలో ఆపేసి ప్రకటనలు వేయడం సరికాదని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆతిథ్య శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌తో గురువారం తలపడనుంది.

Story first published: Wednesday, March 7, 2018, 12:37 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి