న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై విచారణ!!

Sri Lankan government launches probe into 2011 World Cup final fixing allegation

కొలొంబో: భారత్‌ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌‌ ఫిక్సింగ్‌ ఆరోపణల అంశం మరో కీలక మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ మాజీ క్రీడా మంత్రి మహిందానంద అలుత్‌గమగె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర లేదని, కొన్ని పార్టీలు పాలుపంచుకున్నాయన్న నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకునేందుకు లంక క్రీడా శాఖ మంత్రి దుల్లాస్‌ అలాహప్పెరుమా సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.

ఖేల్‌రత్నకు కిడాంబి శ్రీకాంత్‌!!ఖేల్‌రత్నకు కిడాంబి శ్రీకాంత్‌!!

విచారణకు ఆదేశం:

విచారణకు ఆదేశం:

ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌‌ ఫిక్సింగ్‌ దర్యాప్తు ప్రగతిపై ప్రతి రెండు వారాలకొకసారి నివేదిక అందించాలని అలాహప్పెరుమా ఆదేశించారు. ఆయన ఈ మేరకు సంబంధిత శాఖా కార్యదర్శి కేఏడీఎస్‌ రువాన్‌చంద్ర క్రీడాశాఖ దర్యాప్తు విభాగానికి ఫిర్యాదు చేశారు. మహిందానంద ఆరోపణల్లో ఉన్న అసలు వాస్తవాలేంటో దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశముంది. మొత్తానికి ఈ వివాదం రెండు దేశాల్లో అలజడి రేపింది.

ప్రపంచకప్‌ను మేం అమ్మేశాం:

ప్రపంచకప్‌ను మేం అమ్మేశాం:

మహిందానంద అలుత్‌గమగె గతంలో క్రీడామంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే ప్రపంచకప్‌ జరిగింది. '2011 ప్రపంచకప్‌ను మేం అమ్మేశామని ఈ రోజు చెప్తున్నా. క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే చెప్పా. ఒక దేశానికి సంబంధించిన మంత్రిగా నేను ఈ విషయం ప్రకటించాలనుకోవట్లేదు. ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందని మీకు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా' అని ప్రస్తుతం విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న మహిందానంద తెలిపాడు.

వివాదం ఇప్పటిది కాదు :

వివాదం ఇప్పటిది కాదు :

2011 క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం ఇప్పటిది కాదు. గతంలోనూ ఈ అంశం వార్తల్లో నిలిచింది. సరిగ్గా మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ.. ప్రపంచకప్‌ తుదిపోరుపై విచారణ జరుపాలంటూ డిమాండ్‌ చేశాడు. అప్పటి ఫైనల్‌ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రణతుంగ..‌ లంక ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెప్పుకొచ్చాడు. 'ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడేం చెప్పలేను. కానీ ఏదో ఒక నాడు నిజం బయటపెడుతా. అందుకే దీనిపై విచారణ జరుపాలనుంటున్నా' అని రణతుంగ అన్నాడు.

సర్కస్‌ మళ్లీ మొదలైనట్లుంది:

సర్కస్‌ మళ్లీ మొదలైనట్లుంది:

అలుత్‌గమగె చేసిన ఆరోపణలను లంక దిగ్గజ ఆటగాళ్లు మహేళ జయవర్ధనె, కుమార సంగక్కర ఖండించారు. తగిన ఆధారాలు చూపాలని మంత్రిని వారు డిమాండ్‌ చేశారు. 'అతను ఆ ఆధారాలను ఐసీసీకి సమర్పించాలి. అప్పుడు దానిపై విచారణ జరుగుతుంది' అని సంగక్కర ట్వీట్‌ చేశాడు. 'ఎన్నికలు రాబోతున్నాయా?. సర్కస్‌ మళ్లీ మొదలైనట్లుంది. వాళ్ల పేర్లు, ఆధారాలు ఎక్కడ?' అని జయవర్ధనె ప్రశ్నించాడు.

Story first published: Saturday, June 20, 2020, 11:51 [IST]
Other articles published on Jun 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X