న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

73కే ఆలౌట్..:పునరాగమనం తర్వాత టెస్టుల్లో సఫారీలు అతి తక్కువ స్కోరు

By Nageshwara Rao
Sri Lanka vs South Africa 1st Test: Dilruwan bamboozles pitiful Proteas to seal crushing win

హైదరాబాద్: గాలే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు అదరగొట్టింది. సఫారీ బ్యాట్స్‌మెన్‌కు ఆతిథ్య బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 352 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు.. లంక స్పిన్నర్ దిల్‌రువాన్ పెరీరా దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 73 పరుగులకే ఆలౌటైంది.

1957లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో సఫారీ జట్టు 72కే ఆలౌటైంది. 1992లో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికా నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. 2015లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌‌తో జరిగిన టెస్టులో 79 పరుగులకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా ఇప్పుడు అంత కంటే తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

Sri Lanka vs South Africa 1st Test: Dilruwan bamboozles pitiful Proteas to seal crushing win

1932 తరువాత రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200 కన్నా తక్కువ పరుగులు(199, రెండు ఇన్నింగ్స్‌ల్లో) సాధించడం కూడా ఇదే తొలిసారి. లంక స్పిన్నర్లు వైవిధ్య బంతులతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చారు. స్పిన్నర్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆతిథ్య జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

ఓపెనర్ దిముత్ కరుణరత్నే 158 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 126 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు అద్భుత ప్రదర్శనతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ కరుణరత్నే 60 పరుగులు చేయడంతో లంక 190 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. 28.5 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. ఫిలాండర్(22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టెస్టు స్పెషలిస్ట్ ఆమ్లా డకౌట్‌గా వెనుదిరగగా.. కెప్టెన్ డుప్లెసిస్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సఫారీలను శ్రీలంక స్పిన్నర్లు పెరీరా, హెరాత్ దారుణంగా దెబ్బకొట్టారు. పెరీరా 14 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీయగా, హెరాత్ మూడు వికెట్లు తీశాడు.

దీంతో శ్రీలంక 278 పరుగుల తేడాతో తొలి టెస్టులో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, మలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన కగిసో రబాడ.. టెస్టుల్లో 150 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

మరోవైపు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీసిన డేల్ స్టెయిన్ టెస్టుల్లో 421 వికెట్లు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా షాన్ పోలాక్ రికార్డును సమం చేశాడు. ఇంకో వికెట్ తీస్తే టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా డేల్ స్టెయిన్ చరిత్ర సృష్టిస్తాడు.

Story first published: Saturday, July 14, 2018, 17:43 [IST]
Other articles published on Jul 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X