న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలిసారి 3-0తో క్లీన్‌స్వీప్: శ్రీలంక గడ్డపై చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్

Sri Lanka vs England: Excellent England complete first Test clean sweep in Sri Lanka

హైదరాబాద్: సొంతగడ్డపై శ్రీలంక జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటికే శ్రీలంకను వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఓడించిన పర్యాటక ఇంగ్లాండ్ జట్టు మూడు టెస్టుల సిరిస్‌ను 3-0తో క్లీన్‌‌స్వీప్ చేసింది. శ్రీలంక గడ్డపై ఇంగ్లాండ్‌ జట్టుకు ఇదే మొట్టమొదటి క్లీన్ స్వీప్ సిరిస్ కావడం విశేషం.

<strong>ధోనీని ఎక్కడ నుంచి పట్టుకొచ్చావ్?: ముషారఫ్‌ ప్రశ్నకు గంగూలీ జవాబు ఇదీ</strong>ధోనీని ఎక్కడ నుంచి పట్టుకొచ్చావ్?: ముషారఫ్‌ ప్రశ్నకు గంగూలీ జవాబు ఇదీ

కొలంబో వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై ఇంగ్లాండ్ జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆటలో భాగంగా నాలుగో రోజైన సోమవారం 327 పరుగుల లక్ష్య ఛేదనని కొనసాగించిన శ్రీలంక జట్టు 284 పరుగులకే ఆలౌటైంది.

లంక జట్టులో కుశాల్ మెండిస్ (86), రోశన్ సిల్వా (65), పుష్పకుమార (42 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ విజయంలో బౌలర్లు స్పిన్నర్ మొయిన్ అలీ (4/92), జాక్ లెక్ (4/72) కీలకపాత్ర పోషించారు. శుక్రవారం శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బెయిర్‌స్టో (110) సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు 240 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇంగ్లాండ్‌కి 96 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లాండ్ జట్టు 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంకకు 327 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 82 పరుగులకో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో పుష్పకుమార (42 నాటౌట్) రాణించినప్పటికీ, ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయాడు. ఈ టెస్టు సిరీస్‌ కంటే ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకున్న ఇంగ్లాండ్.. ఆ తర్వాత జరిగిన ఏకైక టీ20లోనూ విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన జానీ బెయిర్ స్టోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టెస్టులో శ్రీలంకలో ఇంగ్లాండ్ పర్యటన ముగిసింది.

స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్
ఇంగ్లాండ్: 336
శ్రీలంక: 240

రెండో ఇన్నింగ్స్
ఇంగ్లాండ్: 230
శ్రీలంక: 284

మ్యాచ్ ఫలితం: 42 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

Story first published: Monday, November 26, 2018, 17:24 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X