న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

17 ఏళ్ల తర్వాత లంకలో టెస్టు సిరిస్ నెగ్గిన ఇంగ్లాండ్

Sri Lanka v England: Moeen Ali and Jack Leach wrap up series win for tourists

హైదరాబాద్: లంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో 57 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.

'ధోనీ 20 ఏళ్ల కుర్రాడేం కాదు.. ఆశించడం మానేయండి' 'ధోనీ 20 ఏళ్ల కుర్రాడేం కాదు.. ఆశించడం మానేయండి'

తద్వారా 17 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు నిలిచింది. చివరిసారి 2001లో నాసిర్ హుస్సేన్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టు లంకలో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో రోజే విజయాన్ని ఖాయం చేసుకున్న ఇంగ్లాండ్‌ ఆఖరిరోజు అరగంటలోపే మ్యాచ్‌ని ముగించింది.

 226/7 ఓవర్‌నైట్ స్కోరుతో

226/7 ఓవర్‌నైట్ స్కోరుతో

301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 226/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి రోజు 75 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 17 పరుగులు మాత్రమే జోడించి చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు లంక పతనాన్ని శాసించారు.

 ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్ లీచ్

ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్ లీచ్

మొయిన్ అలీ (4/72) ఒకే ఓవర్‌లో మూడు బంతుల తేడాలో డిక్‌వెల్లా (35), లక్మల్ (0)ను ఔట్ చేయగా, పుష్పకుమార (1)ను లీచ్ (5/83) పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్‌ ఐదు వికెట్లు తీయగా... మొయిన్‌ అలీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

జో రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు

జో రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. జో రూట్‌ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌ విదేశాల్లో సిరీస్‌ గెలవడం ఇదే మొట్టమొదటిసారి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు నవంబర్ 23న కొలంబో వేదికగా ప్రారంభం కానుంది.

స్కోరు వివరాలు:

స్కోరు వివరాలు:

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 336

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 346

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: 243.

Story first published: Monday, November 19, 2018, 12:08 [IST]
Other articles published on Nov 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X