న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక 'మిస్టరీ స్పిన్నర్‌'

Sri Lanka Mystery Spinner Ajantha Mendis Announces Retirement || Oneindia Telugu
Sri Lanka mystery spinner Ajantha Mendis retires from all forms of cricket

కొలంబో: శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ (34) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు మెండిస్‌ వెల్లడించాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మెండిస్‌ను చాలా కాలంగా జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంతో నిరాశ చెందిన అతడు రిటైర్మెంట్‌ ప్రకటించాడని బీబీసీ సింహళ ధ్రువీకరించింది.

రైడింగ్‌లో వికాస్‌ మెరుపులు.. హరియాణా హ్యాట్రిక్‌ విజయంరైడింగ్‌లో వికాస్‌ మెరుపులు.. హరియాణా హ్యాట్రిక్‌ విజయం

2015లో చివరి మ్యాచ్‌:

2015లో చివరి మ్యాచ్‌:

క్యారమ్‌ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించిన మెండిస్‌ లంక తరఫున 2015లో చివరి మ్యాచ్‌ ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం గమనార్హం. మెండిస్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో లంక తరపున 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 70 వికెట్లు, వన్డేల్లో 152 వికెట్లు, టీ20ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రం టెస్టులోనే మెండిస్‌ 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తొలి వన్డేలో 3, తొలి టీ20లో 4 వికెట్లు తీశాడు.

రహస్యాన్ని కనిపెట్టిన బ్యాట్స్‌మెన్‌:

రహస్యాన్ని కనిపెట్టిన బ్యాట్స్‌మెన్‌:

తొలినాళ్లలో అజంతా మెండిస్‌ మిస్టరీ బౌలింగ్‌ను చూసి లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ స్థాయికి ఎదుగుతాడని అందరూ భావించారు. అయితే మెండిస్‌ పదే పదే అవే బంతులు వేయడంతో బ్యాట్స్‌మెన్‌ అతడి బౌలింగ్‌ శైలి రహస్యాన్ని కనిపెట్టారు. దీంతో అతను తేలిపోయాడు. ఒక సాధారణ స్పిన్నర్‌గా మారిపోవడంతో పాటు గాయాల కారణంగా కెరీర్‌లో వెనుకబడి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో అతనికి చోటు దక్కలేదు.

మూడు ఫార్మాట్లలోనూ ఆరేసి వికెట్లు:

మూడు ఫార్మాట్లలోనూ ఆరేసి వికెట్లు:

వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మెండిస్‌ రికార్డుల్లో నిలిచాడు. అలాగే మూడు ఫార్మాట్లలోనూ ఆరేసి వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గానూ అజంతా రికార్డు సృష్టించాడు. ఇక టీ20 క్రికెట్‌లో రెండుసార్లు 6 వికెట్ల సాధించిన ఘనత మెండిస్‌కే దక్కింది. 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు, 2011లో ఆసీస్‌పై 16 పరుగులకు 6 వికెట్లు తీసాడు.

నవీన్‌ కుమార్‌ సూపర్-10.. ముంబాను చిత్తుచేసి టాప్‌కు చేరిన ఢిల్లీ

భారత్‌పై 6/13 గణాంకాలు:

భారత్‌పై 6/13 గణాంకాలు:

2008 ఆసియా కప్‌ ఫైనల్‌లో మెండిస్‌ భారత్‌పై 6/13 గణాంకాలను నమోదు చేసి సంచలనం సృష్టించాడు. అనంతరం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను మెండిస్‌ వణికించాడు. అతని స్పిన్ దెబ్బకు టీమిండియా ఏకంగా సిరీస్‌ 2-1తో కోల్పోయింది. మనోడి బంతులకు ఆరు ఇన్నింగ్స్‌లలో సచిన్, గంగూలీ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. టీమిండియా వాల్ ద్రవిడ్‌ మాత్రం ఒక అర్ధ సెంచరీ చేసాడు. ఇక ధోనీ, యువరాజ్ లాంటి యువ ఆటగాళ్లు క్రీజులో కూడా నిలబడలేదు. మూడు టెస్టులలో ఏకంగా 26 వికెట్లు తీసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు.

Story first published: Thursday, August 29, 2019, 9:47 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X