శాంతిని నెలకొల్పుదామంటోన్న లంక క్రికెటర్లు

Posted By:
Sri Lanka crisis: Cricketers call for peace and unity

హైదరాబాద్: రెండు మతాల కార్చిచ్చులో నలిగిపోతోన్న లంక దేశంలో శాంతి నెలకొల్పుదామంటూ లంక క్రికెటర్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా దేశ వ్యాప్తంగా అందరూ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. వీరితో పాటుగా భారత బౌలర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఏకీభవించాడు.

చాలా కాలం క్రితం ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్‌)తో లంక దేశంలో గొడవలు చెలరేగాయి. మళ్లీ ఇప్పటి వరకు శ్రీలంకలో ఇటువంటి వివాదాలు తలెత్తింది లేదు. అదే కాక, 80, 90 శతాబ్దాల్లో సైతం శ్రీలంక దేశం చాలా నష్టానికి గురైంది. వీటికి కారణం.. 1983లో చెలరేగిన ముస్లిం, బౌద్ద మతాల గొడవలు మతాల పేరుతో గొడవలు రేగడమే. అలాంటిది మళ్లీ పునరావృతం అయితే దేశం అతలాకుతలం అయిపోతుంది.

ఈ సందర్భంగా ఆ దేశ క్రికెటర్లు తమ వంతుగా స్పందించి శాంతికి పిలుపునిచ్చారు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా భారత, బంగ్లాదేశ్ క్రికెటర్లు సైతం అక్కడికి వెళ్లి ఆడేందుకు భద్రతా కారణాల రీత్యా భయాందోళనకు గురైయ్యారు.

నిదహాస్ ట్రోఫీలో భాగంగా లంక వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‍‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో నష్టపోయింది. ఈ మ్యాచ్‌లో కుశాల్ పెరీరా ఒక్కడే 37 బంతుల్లో 66పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరు సంపాదించి పెట్టాడు. రెండో టీ 20ని బంగ్లాదేశ్ జట్టుతో గురువారం తలపడనుంది.

Story first published: Thursday, March 8, 2018, 11:15 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి