ఇర్ఫాన్ పఠాన్ సలహా వల్లే ఇక్కడి దాకా వచ్చా: అబ్దుల్ సమద్

bdul Samad Talks About The Advice He Got From Team India Senior | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇచ్చిన సలహా వల్లే కెరీర్‌లో ఇక్కడిదాకా రాగలిగానని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ తెలిపాడు. ఫస్ట్ సీజన్‌లోనే సూపర్ బ్యాటింగ్‌తో సమద్ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చెల్లించిన కనీస ధర రూ.20 లక్షల్లో ప్రతీ రూపాయికి న్యాయం చేశాడు. 170 స్ట్రైక్‌రేట్‌తో 111 పరుగులు చేశాడు.

ఇక క్వాలిఫయర్-2లో అతను ఆడిన పోరాడిన విధానం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించేంత పనిచేశాడు. అయితే మరో ఎండ్‌లో సహకారం లేకపోవడం.. చేజింగ్ రన్ రేట్ పెరగడంతో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఓడిన తన బ్యాటింగ్‌తో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాడు.

అయితే తన సక్సెస్ క్రెడిట్ అంతా ఇర్ఫాన్ పఠాన్‌దేనని సమద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బంది పడేవాడని. ఓ సారి అండర్-19 వన్డే మ్యాచ్‌లు ఆడి స్వస్థలానికి వచ్చేసరికి ఇర్ఫాన్ పఠాన్ ఆధ్వర్యంలో క్యాంప్ జరుగుతోంది. అక్కడ నా బ్యాటింగ్ చూసిన పఠాన్.. నన్ను బాగా గైడ్ చేశాడు. పెద్ద స్కోర్లు చెయ్యడంలో ఎందుకు విఫలవవుతున్నావని నన్ను ప్రశ్నించాడు. కాస్త ఓపిగ్గా ఆడలేకపోతున్నానని బదులిచ్చా.

అయితే ఎడపెడా షాట్స్ కొట్టడం కంటే సెలెక్టివ్‌గా భారీ షాట్స్ ఆడితే మంచి స్కోర్లు చేయగలవని సూచించాడు. అలా ఆడితేనే ఏదో ఒక రోజు టీమిండియాలో ఉంటానని చెప్పాడు. ఆ తర్వాత ఓపిగ్గా ఆడటం నేర్చుకున్నా. ముస్తాక్ అలీ టోర్నీ ఎంపికయ్యా. నాగలాండ్‌తో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 76 రన్స్ చేశా. దాంతో కెరీర్ మలుపు తిరిగింది.'అని సమద్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, November 16, 2020, 9:02 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X